Advertisement
భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భక్తులతో కిటికిటలాడుతూ ఉంటుంది. మిస్టరీతో కూడిన ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయాల గురించి సైంటిస్టులు ఎన్నిసార్లు పరిశోధనలు చేసిన జవాబు లేని ప్రశ్నలు గానీ ఉన్నాయి గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
దారువేష్ దర్గా
పూణేలో ఇది ఉంది ఇక్కడ 11 మంది కలిసి ఒక వేలు సహాయంతో ఒక రాయిని పైకి లేపాలి. ఆ రాయిని కూడా హజరత్ కుమార్ అలీ ధర్వేష్ అని అంటూ పైకి లేపాలి. అలా చేశాక అది అడుగులు ఎత్తుకు వెళ్లి గాలిలో తేలుతూ అలాగే ఉంటుంది.
తంజావూరు బృహదీశ్వరాలయం
ఈ ఆలయం నీడలు నేల మీద పడవు ఇప్పటికీ రహస్యంగానే ఉంది పైగా ఈ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ ని ఎక్కడినుంచి తెప్పించారనేది కూడా ఎవరికీ తెలీదు.
పూరి జగన్నాథ్ ఆలయం
సింహద్వారం వరకు వినిపించే సముద్ర ఘోష సింహద్వారం దాటి లోపలికి వెళ్తే వినపడదు. దాని వెనుక కారణం కూడా తెలియదు.
కబీస్ బాబా ఆలయం
యూపీలో సీతాపూర్ జిల్లాలో ఉండే ఈ ఆలయం విచిత్రమైనది. దేవుళ్లేని ఆలయం. ఇక్కడ విగ్రహం ఉండదు పూజారి కూడా ఉండడు.
లేపాక్షి
Advertisement
లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. ఆలయ స్తంభాల మిస్టరీ ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ ఆలస్తంభం కింద ఏమైనా పెట్టొచ్చు స్తంభానికి ఫ్లోర్ కి మధ్య ఉండడమే దీనికి కారణం. స్తంభం ఫ్లోర్ ని తాగకుండా గుడిని ఎలా మోస్తుందో మిస్టరీగానే మిగిలిపోయింది.
యాగంటి
ఇక్కడ ఉన్న నంది విగ్రహం మొదట్లో చిన్నగా ఉండేది కానీ రాను రాను పెరుగుతూ వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. దీనిపై ఎన్నో పరిశోధనలు జరిపారు సైంటిస్టులు. కానీ ఈ ప్రశ్నకి సమాధానం దొరకలేదు.
శని సింగనాపూర్
శని సింగనాపూర్ గ్రామంలో ఉండే ఇళ్లకు తలుపులు ఉండవు. ఇప్పటివరకు ఒక్క దొంగతనం జరిగిన సంఘటన కూడా లేదని స్థానికులు అంటున్నారు.
షోలాపూర్
మహారాష్ట్ర షోలాపూర్ లో శత్ఫల్ అనే వింత గ్రామం ఒకటి ఉంది ఇక్కడ పాములని పూజిస్తారు ఇంట్లోని మనుషుల్లోనే పాములు తిరుగుతాయి. ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఒకర్ని కూడా పాము కరవలేదట.
అమ్రోహ
యూపీలోని అమ్రోహ చుట్టూ తేళ్లు కాపలాగా ఉంటాయి. ఆలయం లోపల ఆలయం చుట్టూ కూడా తిరుగుతాయి వచ్చే భక్తుల్ని మాత్రం కుట్టవు.
గురుద్వార్
పంజాబ్ రాష్ట్రంలో ఇది ఉంది. ఇక్కడ ఉన్న మామిడి చెట్లు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ప్రతి రోజూ కూడా కాస్తాయట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!