Advertisement
ఎప్పుడైనా ఏదైనా వాచీ షాప్ కి వెళితే అక్కడ ఉండే వాచ్ లను కానీ గడియారాలు కానీ గమనించినట్లయితే వాటిల్లో టైం 10:10 ఉంటుంది. ఎప్పుడైనా ఎందుకు కొత్త వాచ్లకి ఇలా టైం సెట్ చేసి పెడతారు అనే సందేహం మీకు కలిగిందా… నాకు కూడా ఈ సందేహం చాలాసార్లు కలిగింది. మీకు కలిగినట్లయితే వెంటనే ఆన్సర్ చూసేయండి. ఎప్పుడైనా మనం గూగుల్ లో ఏదైనా ఇమేజ్ ని సెట్ చేసినా లేదంటే వాట్సాప్ లో గమనించినా గడియారంలో కానీ వాచ్ లో కానీ టైం 10:10 అనే ఉంటుంది.
Advertisement
చాలామంది దీన్ని గమనించరు కానీ ఎక్కువగా ఇలాంటి ఇమేజెస్ ఇలాంటి వాచీలే మనకి కనబడతాయి. ఇది ఇలా ఉంటే కొన్ని కంపెనీలు మాత్రం 08:20 టైం సెట్ చేసి పెడుతుంది ఇదివరకు మాత్రమే ఇలా జరిగేది కానీ ఈ మధ్య టైం 10:10 అనే సెట్ చేస్తున్నారు. అయితే దీని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి.
Advertisement
ఈ సమయానికి అబ్రహం లింకన్ చనిపోయారని అందుకే ఇలా పెట్టారని ఒక పుకారు ఉంది కానీ నిజానికి అబ్రహం లింకన్ 10:15 కి చనిపోయారు. మరొక పుకారు ఏంటంటే నాగసాకి లేదా హిరోషిమాలో దాడి జరిగింది ఇదే సమయానికి అని అన్నారు. కానీ అది కూడా నిజం కాదు. నిజానికి 10:10 అయినప్పుడు వి ఆకారంలో ముల్లులు ఉంటాయి. వి అనేది విక్టరీని సూచిస్తుంది అందుకే విక్టరీకి చిహ్నంగా ఇలా 10:10 ఉపయోగిస్తారు.
పైగా ఇంకో కారణం ఏంటంటే ఇలా టైం సెట్ చేసినప్పుడు మధ్యలో ఉండే వాచ్ కంపెనీ బ్రాండ్ పేరు స్పష్టంగా కనబడుతుంది. వాచ్ ని చూడగానే రెండు ముల్లులకి మధ్యలో కంపెనీ పేరు బాగా క్లియర్ గా కనబడటం మీద మనం ఫోకస్ చేస్తాము. అందుకే ఈ విధంగా టైం ని సెట్ చేసి వాచీలకి పెడతారు.
Also read:
భర్త బతకడని తెలిసి.. ఇద్దరి పిల్లలతో ఆమె అలా… అసలేం జరిగింది అంటే..?
మాల్స్ లో ఫుడ్ కోర్ట్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటుంది..? రీజన్ ఏమిటి..?
కాబోయే జీవితభాగస్వామిని పెళ్ళికి ముందు.. కచ్చితంగా ఈ 6 విషయాలు అడగాలి..!