Advertisement
స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. సిబిఎన్ ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. నేడు ఉదయం ఉదయం 9:30 గంటల టైం లో దాదాపు తొమ్మిది మంది సిఐడి అధికారులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. వీరితో పాటు సిబిఎన్ తరపున మరో ఇద్దరు లాయర్లు కూడా వెళ్లారు.
Advertisement
అయితే.. ఈరోజుతో విచారణ ముగిసింది. ఈ విచారణపై అందరికి ఉత్కంఠ గా ఉంది. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు చూసేయండి.
ఇవి కూడా చదవండి: అందరిముందు పాకిస్థాన్ అధ్యక్షుడిని కడిగిపారేసింది.. అసలు ఎవరు ఈ అమ్మాయి..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
ఇవి కూడా చదవండి: రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త తలనొప్పి ! ఇది కదయ్యా అభిమానం అంటే !
Advertisement
1. ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ రూ.3,300 కోట్ల రూపాయలని ఎలా నిర్ధారించారు?
2. అసలు సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ జీవో ఎలా ఇచ్చారు?
3. ఏ పద్ధతిలో అగ్రిమెంట్ చేసుకున్నారు?
4. జీవోకు వ్యతిరేకంగా ఒప్పందం ఎలా జరిగింది?
5. ఆర్ధిక శాఖ చెప్పిన అభ్యంతరాలు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు నిధులు రిలీజ్ చెయ్యాలి అంటూ ఒత్తిడి చేసారు?
6. దాదాపు 13 సంతకాలు మీవే ఉన్నాయి. అన్ని సంతకాలను పెట్టాక కూడా ఒత్తిడి ఎందుకు తేవాల్సి వచ్చింది?
7. డిజైన్ టెక్ కు నిధులు తరలించడం గురించి మీకు తెలుసా?
8. మనోజ్ పార్థసారధితో మీకు ఎలాంటి సంబంధం ఉంది?
9. తరలించిన నిధులు పెండ్యాల శ్రీనివాస్ కు అందాయని మీకు తెలుసా?
10. AP CID నోటీసులు పంపిన వెంటనే పారిపోవాల్సిన అవసరం వారికి ఏముంది?
సిఐడి డిఐజి ధనుంజయుడు ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరిగింది. రెండు గంటల పాటు విచారణ తరువాత లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ ప్రశ్నలలో సిబిఎన్ కొన్నిటికి మాత్రమే సమాధానం ఇచ్చారట. మరికొన్నింటికి మాత్రం తెలియదు.. గుర్తులేదు అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: ప్రధాని మోడీజి తినే ఈ పరోటాలు తింటే.. ఈ రోగాలు పొరపాటున కూడా మీ దరి చేరవు!