Advertisement
సినిమా ఇండస్ట్రీ అంటేనే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. ఎప్పుడు ఏ నటుడు ఎలా మారిపోతాడో చెప్పడం కష్టం.. రాత్రికి రాత్రే కొంతమంది నటులు స్టార్ లుగా మారి పోతారు.. మరికొంతమంది స్టార్డం నుంచి పాతాళానికి పడిపోతారు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ నటీనటులు ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ గా చిన్నచిన్న పాత్రలు చేసిన వారే.. వారెవరో ఇప్పుడు చూద్దాం..
#1. విజయ్ దేవరకొండ:
Advertisement
విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో సాధారణ యాక్టర్ గా చేశారు.. ఆ తర్వాత ఆయన అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు.
#2. సాయి పల్లవి :
ముఖం నిండా మొటిమలతో ప్రేమమ్ సినిమాలో ఒక సాధారణ నటిగా చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఫిదా సినిమా తో అందరి దృష్టిలో పడింది.. పందెంకోడి సినిమా లో మీరా కి స్నేహితురాలిగా నటించింది.
#3. త్రిష:
త్రిష ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం కాకముందు జోడి సినిమా లో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది. వర్షం సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది.
ALSO READ: 1980లో NTR, ANR, కృష్ణ, శోభన్ బాబుల రెమ్యునరేషన్స్ ఎంతంటే?
#4. రవితేజ :
మాస్ రాజా రవితేజ ఇండస్ట్రీ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ స్నేహితుడిగా గ్రూపులో ఒక్కడిగా రవితేజ ఉన్నారు. ఆ తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన నీకోసం మూవీ లో రవితేజ హీరోగా మారారు.
#5. కాజల్ :
Advertisement
బాలీవుడ్ చిత్రం క్యూహు గాయానాలో ఐశ్వర్యరాయ్ స్నేహితురాలిగా నటించింది. లక్ష్మీ కళ్యాణం చిత్రం తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
#6. రీతూ వర్మ :
శీను వైట్ల డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్ షా సినిమాలో కాజల్ చెల్లెలిగా నటించింది..ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్ గా చేసింది.
#7. శర్వానంద్:
యువసేన మూవీ లో నలుగురు హీరోల్లో ఒకడిగా పరిచయమైన శర్వానంద్, ఆ తర్వాత చాలా సైడ్ క్యారెక్టర్లు చేసి, హీరో గా ఎంట్రీ ఇచ్చారు.
#8. విజయ్ సేతుపతి :
ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి, ఒకప్పుడు ధనుష్, కార్తి,జయం రవి హీరోలుగా చేసిన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించారు.
#9. నవీన్ పొలిశెట్టి :
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ నవీన్ ఇద్దరు స్నేహితులు గా నటించారు. ఇక ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో హీరోగా పరిచయమయ్యారు.
#10. సత్యదేవ్ :
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చిన్న రోల్ పోషించారు సత్యదేవ్. అలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, తర్వాత హీరో గా మారాడు.
ALSO READ: ఈ స్టార్ సీరియల్స్ నటీమణులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..?