Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి భారీ అంచనాల నడుమ అనేక హంగులతో సినిమాలు వస్తూ ఉంటాయి.. దానిపై అభిమానులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.. కానీ సినిమా తీరా విడుదలయ్యాక మెప్పించలేక పోతుంది.. కానీ కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితిలో విడుదలవుతాయి. ఇలాంటి సినిమాలు ఒక్కోసారి అంచనాలు దాటి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తాయి. అయితే, ప్రక్రియలో ఇప్పటి జనరేషన్ లో కూడా కొంతమంది నటులు డైరెక్టర్స్ గా మారి తమ సత్తా చాటుతున్నారు. కొంతమంది ఇతర సినిమాలకే దర్శకత్వం వహిస్తే మరికొంతమంది పక్క సినిమాలకు కూడా డైరెక్టర్లుగా వ్యవహరించారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి.
Advertisement
ALSO READ:రైళ్లలో డోర్ దగ్గర విండోస్ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?
# రిషబ్ శెట్టి
ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ ను ఓ ఆట ఆడుకుంటున్న ‘కాంతారా’ సినిమా హీరో గురించి చెప్పుకుందాం. ఏం నటించాడు. అలాగే ఏం డైరెక్ట్ చేశాడు సినిమాని! సూపర్ అంతే!
# రక్షిత్ శెట్టి
రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి కూడా ‘ఉలిదవరు కందంతే’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ‘రిచార్డ్ ఆంథోని’ అనే చిత్రాన్ని కూడా తనే డైరెక్ట్ చేయబోతున్నారు.
Advertisement
# ధనుష్
‘పా పండి’ అనే చిత్రాన్ని ధనుష్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ధనుష్ కూడా నటించాడు.
# రాజు బి శెట్టి
‘ఒండు మొట్టెయ కథ’, ‘గరుడ గమన వృషభ వాహన’ వంటి చిత్రాలను ఈ కన్నడ నటుడు నటించి, డైరెక్ట్ చేశాడు.
# విశ్వక్సేన్
ఫలక్ నూమా దాస్ అనే చిత్రాన్ని ఇతనే డైరెక్ట్ చేశాడు. అందులో హీరోగా కూడా నటించాడు.
# మాధవన్
‘రాకెట్రి: దినంబి ఎఫెక్ట్’ అనే చిత్రాన్ని మాధవన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు.
# అడవి శేష్
‘కర్మ’, ‘కిస్’ వంటి చిత్రాలను అడవి శేషు డైరెక్ట్ చేశాడు. అలాగే ఈ సినిమాల్లో అతను హీరోగా కూడా నటించాడు.
# పవన్ కళ్యాణ్
‘జానీ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసింది మన పవర్ స్టారే. ఆ సినిమాలో హీరోగా కూడా నటించింది ఆయనే.
# విశాల్
‘తుప్పరి వాలన్ 2’ అనే చిత్తాన్ని విషయాలు డైరెక్ట్ చేయబోతున్నాడు.
# పృథ్వీరాజ్ సుకుమారన్
‘లూసీఫర్’ అనే చిత్రాన్ని ఇతను ఎంత మాస్ గా తీశాడో మనం చూసాం. ఇందులో అతను కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.