Advertisement
భార్యాభర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి. భారం కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి. సంసారం అంటే కలిసి ఉండటం కాదు, కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం. అయితే భార్యా, భర్తలు ఒకరితో మరొకరు కొన్ని విషయాలను షేర్ చేసుకోవద్దు. ఆ విషయాలను షేర్ చేసుకుంటే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
పెళ్లికి ముందు ఉన్న ప్రేమలు, అఫైర్స్ గురించి ఒకరితో మరొకరు చర్చించుకోకూడదు. దానివల్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరిలో ఎవరైనా తప్పు చేస్తే మరొకరు దాన్ని పదేపదే ఎత్తిచూపకూడదు. అలా ఎత్తి చూపడం వల్ల కళాహాలు పెరిగి కాపురాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భార్య కుటుంబ సభ్యుల గురించి భర్త, భర్త కుటుంబ సభ్యుల గురించి భార్య చెడుగా మాట్లాడకూడదు. అలా కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. భార్య స్నేహితుల గురించి భర్త, భర్త స్నేహితుల గురించి భార్య గుచ్చి గుచ్చి అడగకూడదు.
Advertisement
అలా చేసిన లేనిపోని అనుమానాలు వచ్చి కాపురంలో కళాహాలు వచ్చే అవకాశం ఉంది. భార్య కానీ భర్త కానీ అందం విషయంలో సంపాదన విషయంలో లేదా ఇతర విషయాల్లో మరొకరితో పోల్చకూడదు. అలా పోల్చడం వల్ల గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఇద్దరిలో ఎవరికైనా ఆర్థిక సమస్యలు వస్తే వాటిని ఒకరిపై మరొకరు వేయకుండా ఎవరివి వాళ్లే పరిష్కరించుకుంటే మంచిది. పెళ్లికి ముందు ఉండే చెడు అలవాట్లు పూర్తిగా వదిలేయాలి. భార్య కానీ, భర్త కానీ పెళ్లి తర్వాత కూడా ఆ చెడు అలవాట్లను కొనసాగిస్తే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.
Read also : రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!