Advertisement
రోజురోజుకీ మనం పాటించే పద్ధతులు మారిపోతున్నాయి. మనకి అనుకూలంగా ఉండేటట్టు మనం మార్చేసుకుంటున్నాము. కానీ 1000 ఏళ్ళ క్రితం భారతదేశంలో ఇటువంటి కట్టుబాట్లు ఉన్నాయి. మరి ఇక వాటికోసం చూసేద్దాం. మన భారత దేశంలోనే అనేక నాగరికతలు మొదలయ్యాయి. ఎంతో పురాతన చరిత్ర మన భారతదేశానికి ఉంది. పాతకాలంలో కేవలం ఆహారం కోసం మాత్రమే అందరూ పని చేసేవారు. ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడే వాళ్ళు. అందుకు వ్యవసాయం చేసే వాళ్ళు. అప్పట్లో వ్యవసాయం చేయడానికి పనిముట్లు వంటివి ఉండేవి కావు. పంట తీయడానికి సంవత్సరం అంతా కూడా కష్టపడేవారు.
Advertisement
Advertisement
తర్వాత నెమ్మది నెమ్మదిగా పనిముట్లు అందుబాటులోకి వచ్చాయి. పనిముట్లు వచ్చిన తర్వాత ఏడాదికి రెండు పంటలు పండించేవారు. వరి, పత్తి వంటివి ఎక్కువగా పండించేవారు. ఎద్దులని ఉపయోగించి ఆ తర్వాత వ్యవసాయం మొదలుపెట్టారు. రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పంటలు ఎక్కువ పండడం జరుగుతోంది. పాతకాలంలో మహిళలు చీరలు మాత్రమే కట్టుకునేవారు. పురుషులు ధోవతిని గోచిలా పెట్టుకునేవారు. పైన చొక్కా వేసుకునేవారు. చిన్నపిల్లలు కూడా అప్పట్లో గోచి పెట్టుకునేవారు. ఇప్పుడు రాను రాను చీరలు కట్టుకోవడం తగ్గింది విదేశీ వస్త్రధారణ ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటున్నారు. అలానే ఇదివరకు కాలంలో ఆయుర్వేదాన్ని మాత్రమే పాటించేవారు. కానీ ఇప్పుడు ఆయుర్వేద పద్ధతుల్ని పాటించేవారు తగ్గారు.
Also read: