Advertisement
హీరో సూర్యను, దర్శకుడు మురగదాస్ ను ఓవరాల్ గా సౌత్ ఇండియా అంతట పాపులర్ చేసిన సినిమా గజిని. ఈ సినిమాతో సూర్యకు క్రేజ్ పెరిగింది. అయితే 12 మంది హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. చివరకు ఈ కథ అటు ఇటు తిరిగివచ్చి సూర్య చేతిలో పడింది. 2003 నుంచి ఈ కథను పట్టుకొని హీరోల దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టారట మురుగదాస్. ఇక తెలుగు నిర్మాతల దగ్గరకు కూడా మురగదాస్ వచ్చారు.
Advertisement
సురేష్ బాబుకు ఈ కథ చెబితే ఆయన తన బ్యానర్లో ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది రిస్కీ కథ కదా? ఏ హీరో చేస్తాడు. అని ఆయన అడిగితే మహేష్ బాబు అయితే బాగుంటుందని కూడా మురగదాస్ సురేష్ తో అన్నారు. మహేష్ ను కలిసి కథ చెబితే బాగుందని, తనకు సూట్ కాదని రిజెక్ట్ చేశారు. చివరకు వెంకటేష్ తో చేయాలని ప్లాన్ చేశారు.అయితే గుండు గెటప్ చేసేందుకు వెంకటేష్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత అల్లు అరవింద్ ను కలిసి పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు. అయితే అప్పటికే జానీ ప్లాప్ తో ఉన్న పవన్ ఈ సినిమాపై అస్సలు ఆసక్తి చూపలేదు. ఇక తెలుగు హీరోలను వదిలేసి తమిళ హీరోల వెంటపడ్డాడు మురుగదాస్. అక్కడ కమల్ హాసన్ నో చెప్పాడు. విజయ్ వద్దన్నాడు. ఇలా 10 హీరోలు ఈ కథను వద్దనడంతో మురుగదాస్ చివరకు ఈ కథను పక్కన పెట్టేయాలని అనుకున్నాడు.
Advertisement
ఆ టైంలో అనుకోకుండా అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోయిన్ గా ఆశిన్, సెకండ్ రోల్లో శ్రియ, విలన్ గా ప్రకాష్ రాజ్ అనుకున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్. 2004 మార్చిలో షూటింగ్ స్టార్ట్, మీరతల్ టైటిల్ గా పెట్టారు. ఆసిన్ తో ఫోటోషూట్ అయ్యింది. 15 రోజుల షూటింగ్ తర్వాత నిర్మాతతో గ్యాప్ రావడంతో అజిత్ సడన్ గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో నిర్మాతలు మాధవన్ తో తీయాలని అనుకున్నారు. ముందు ఓకే చెప్పినా తర్వాత మాధవన్ కూడా ఎస్కేప్ అయ్యాడు. చివరకు నిర్మాతలు ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. చివరకు ఈ సినిమా ఎలాగైనా చేయాలన్న మురుగదాస్ కసి మరింత పెరిగింది. అలా ఆ కథతో సూర్య ను కలిసి ఒప్పించాడు. సూర్య ఓకే చెప్పాడు. దీంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది.
also read: డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?