Advertisement
ప్రేమ.. ప్రపంచంలోనే అత్యంత ఎమోషనల్ ఫీలింగ్. ఒక్కసారి ప్రేమలో పడ్డారో.. అందులోంచి బయటకు రావడం చాలా కష్టం. అయితే..మన ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ కు చెందిన యాబై ఐదేళ్ల వ్యక్తి, ఓ 18 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ వారధిగా నిలిచింది ‘బాబి డియోల్ పాట’. ఇదేంటీ పాకిస్థాన్ అంటున్నామని అనుకుంటున్నారా.. ఈ ప్రేమ వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ కు చెందిన 18 ఏళ్ల ముస్కాన్ పాటలు చాలా బాగా పాడుతుంది. వాళ్ళింటికి ఎదురుగా ఉండే 55 ఏళ్ల ఫరూక్ ను ఆమె స్వరం ఆకట్టుకుంది.
Advertisement
తరచూ ఆమె స్వరాన్ని వినేందుకు వాళ్ళింటికి వెళ్లేవాడు. పాటల గురించి చర్చించుకునేవారు. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమె బాబీ డియోల్ పాటైనా ‘నా మీలో హంసే జాదా’ అనే పాట ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచింది. “నాకు సంగీతం అంటే ఇష్టం. అలా ముస్కాన్ ను తో పరిచయం పెరిగింది. తర్వాత ముస్కాన్ నాకు ప్రపోజ్ చేసింది. ముందు షాక్ అయ్యాను కానీ నేను కూడా తనను ప్రేమిస్తున్నాను అని తెలుసుకున్నాను.
Advertisement
తన ప్రేమ నాకు ఎంతో అమూల్యమైనది” అని ఫరూక్ తెలిపారు. “నాపై ఫరూక్ చూపించే అభిమానం నన్ను ఆకట్టుకుంది. మా బంధాన్ని అందరూ ఏమనుకున్నా ఏం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు మొదట్లో ఒప్పుకోలేదు. ఆయన కోసం ఏదైనా చేయగలను, ప్రాణాలు కూడా ఇవ్వగలను” అని ముస్కాన్ తెలిపింది. సయ్యద్ బాసిత్ ఆలీ అనే యూట్యూబర్ వీళ్లను ఇంటర్వ్యూ చేయడంతో వీళ్ళ కథ వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ లో పెట్టిన ఆ వీడియోను, ఆ జంట తమ ప్రేమ కథను పంచుకుంది. ప్రస్తుతం ఈ విచిత్ర ప్రేమ కథ ట్రైనింగ్ గా మారింది. చివరికి ఈ ప్రేమ జంట పెళ్లితో కథ సుఖాంతం చేసుకుంది.
READ ALSO : బుల్లి తెరపై అలరిస్తున్న మన టాలీవుడ్ స్టార్లు..ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా ?