Advertisement
పాత పాస్ పోర్ట్స్, సినిమా టికెట్లు, హోటల్ బిల్స్ వంటివి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అరుదైన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనబడుతుంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో 1964 నాటి అంబాసిడర్ కారు బిల్లు వైరల్ అవుతోంది. చాలామంది సొంత కారులని కొనుగోలు చేస్తూ ఉంటారు బ్రిటిష్ మూలాలు ఉన్నప్పటికీ అంబాసిడర్ ని భారతీయ కారుగానే భావిస్తారు. గతం లో అంబాసిడర్ కారు రోడ్డు మీదకి వస్తే దాని హవా వేరు.
Advertisement
అయితే అంబాసిడర్ కారు ఆ రోజుల్లో కార్ల లో కింగ్. కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా దీనికి పేరు అయితే ఉండేది. భారత ఆర్మీ అధికారుల నుండి ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు దాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా సెలబ్రిటీలు కూడా ఈ కారుని ఉపయోగించే వారు. 90వ దశాబ్దం లో ఈ కారు ఉంటే వాళ్ళు రిచ్ అన్నట్లే లెక్క.
Advertisement
Also read:
Also read:
అంబాసిడర్ స్టేటస్ కి ఒక సింబల్ గా చెప్పేవారు ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్లుగా ఈ కారు అప్డేట్ అవ్వకపోవడంతో అమ్మకాలు పడిపోయాయి. అంబాసిడర్ ధర రూ.16,495 సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పాత బిల్లు చూస్తే ఈ కారుని అక్టోబర్ 20, 1964లో కొనుగోలు చేశారు. బిల్లు ప్రకారం ధర రూ.13,787. సేల్స్ టాక్స్ రూ.1,493 రవాణా రుసుము రూ.897 కారు నంబర్ ప్లేట్ కు రూ.7 వంటి చార్జీల్ని జోడించి రూ.16,495 కి విక్రయించినట్లు బిల్లులో ఉంది. ఇప్పటికే కొంతమంది కారుల మీద ఇష్టం ఉన్నవాళ్లు పాత కార్లు అన్ని రీ మోడలింగ్ చేయించి మరీ వాడుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!