Advertisement
T20 WC 2022 : టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా పరాజయం పాలైంది. టి20 వరల్డ్ కప్-2022 సన్నాహకాల్లో భాగంగా పెర్త్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టు బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అర్థ శతకం వృధాగా పోయింది.
Advertisement
READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
కాగా తోలుతా బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్నిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీం ఇండియా స్పిన్నర్ అశ్విన్ 3, పేసర్లు హర్షల్ పటేల్ (2/27), ఆర్షదీపు ఒక వికెట్ (1/25) దక్కించుకున్నారు. రాహుల్ కు జోడిగా పంత్, ఓపెనర్ గా విఫలం ఓపెనర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు ప్రత్యర్థి జట్టు బౌలర్లు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దె ప్రయత్నం చేశాడు. కానీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ లాన్స్ మోరిస్ తన తొలి ఓవర్ లోనే దీపక్ ను పెవెలియన్ కు చేర్చాడు. దీంతో 7 ఓవర్లలో కేవలం 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా.
Advertisement
ఈ దశలో ఆచితూచి ఆడుతూ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ పాండ్యా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 17 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో భారం మొత్తం రాహుల్ పైనే పడింది. పాండ్యా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 55 బంతుల్లో 74 పరుగులతో ఉన్న రాహుల్ ను అండ్రూ టై అవుట్ చేయడంతో 132 పరుగుల వద్ద టీమిండియా కథ ముగిసింది. బ్యాటింగ్ వైఫల్య కారణంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఏలెవన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.
READ ALSO : కమల్ హాసన్ నుంచి ప్రభాస్ : 2022లో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 10 హీరోలు !