Advertisement
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.. మహాపురుషులవుతారు అని కవి చెప్పిన మాటలు ఈ పేద విద్యార్థికి కరెక్ట్ గా సూట్ అవుతాయి.. ప్రస్తుతం కొంతమంది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో, కాలేజీల్లో చదివి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన చిన్న పరీక్షల్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి ఈ రోజుల్లో కనీసం పూట గడవడమే కష్టంగా ఉన్నా ఆ కుటుంబం నుంచి అమెరికాలో రెండు కోట్ల స్కాలర్షిప్ తో ఇంజనీరింగ్ పూర్తి చేసే ఆఫర్ ను సొంతం చేసుకున్నాడు ఈ పేద విద్యార్థి. అతని టాలెంట్ కు ప్రస్తుతం చాలామంది అభినందనలు తెలియజేస్తున్నారు. టాలెంట్ ఉంటే పేద, ధనిక అనేది అడ్డుకాదని, ఎక్కడికైనా దూసుకు వెళ్ళగలమనే విషయాన్ని చాటి చెప్పాడు ఈ యువకుడు. తాను చదివింది ఏంటి ఆయనకు ఎక్కడ సీటు వచ్చింది. వివరాలు తెలుసుకుందాం.
Advertisement
Also Read: అట్టర్ ఫ్లాఫ్ అయినా, రూ.70 కోట్లు వసూలు చేసిన సినిమాలు!
Advertisement
ప్రస్తుతం ఇంటర్మీడియట్ అయిపోయిందంటే ఎంసెట్ ఈసెట్, ఆ సెట్ అంటూ విద్యార్థులను లాంగ్ టర్మ్ కోచింగ్ లకు కూడా పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక కొడుకు డాక్టరో, ఇంజనీరో ఇంకా ఏదైనా ఉద్యోగం సాధిస్తే మమ్ములను మంచిగా చూసుకుంటారని భావిస్తుంటారు. మరి పైసలు ఉన్నవాళ్ళు ఏమో ఈ విధంగా కోచింగ్ లో పంపిస్తారు. మరి కనీసం తినడానికి తిండి లేని నిరుపేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ కాలేజీల్లో సీటు రావాలని కొడుకు జాబ్ కొట్టాలని కోరుకుంటారు. బీహార్ రాష్ట్రనికి చెందిన విద్యార్థి ప్రేమ్ కుమార్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డయ్యర్ ఫెలోషిప్ అనే సంస్థ వారు ఇచ్చే ఆఫర్ కు వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆరుగురికి వస్తే అందులో ప్రేమ్ కుమార్ ఒకడు. వాళ్ల తండ్రి పాట్నాలో కూలిపని చేసుకుంటూ చదివించాడు.
కనీసం ఉండటానికి కూడా ఇల్లు సరిగా లేని కడు పేదరికం. వాళ్ల కుటుంబానికి చెందిన వాళ్ళలో డిగ్రీ చదవబోయే మొదటి వ్యక్తి ప్రేమ్ కుమారేనట. అయితే ప్రేమ్ కుమార్ చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండడంతో అతను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక సంస్థ వారు అతని తెలివి ని గమనించి తన స్టడీకి సహకారం అందిస్తూ వచ్చారట. దీంతో నిబద్ధతతో చదివినా ఆ ప్రేమ్ కుమార్ అమెరికాలో ఇంజనీరింగ్ సీటు కొట్టి రూపాయి ఖర్చు లేకుండా 2.5 కోట్ల స్కాలర్షిప్ ఆఫర్ సాధించాడు. దీంతో చుట్టుపక్కల వారంతా ఈ విషయం తెలిసి ప్రేమ్ కుమార్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు ప్రేమ్ కుమార్..
ALSO READ: జీన్స్ ప్యాంటు జిప్ పై ఉండే “YKK” అర్థం మీకు తెలుసా..?