Advertisement
పెళ్లి అనేది ఎవరి జీవితంలోకి అయినా కొత్త అధ్యాయాన్ని తీసుకొస్తుంది. అయితే.. ఎవరు ఏ వయసులో ఈ అధ్యాయాన్ని మొదలుపెడతారు అనేది చెప్పలేం. కొందరు తమ ఇరవై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే.. మరికొందరేమో ఏకంగా ముప్పయ్యేళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. అసలు.. ఏ వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది? ఏ వయసులో పెళ్లి చేసుకోవడానికి అనువైన సమయం అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Advertisement
కొంతమంది ఎర్లీ గా లైఫ్ స్టార్ట్ చేయాలనీ అనుకోవచ్చు. కొంతమంది బాగా చదువుకుని, మంచి ఉద్యోగం వచ్చి.. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకోవచ్చు. అయితే.. ఇవన్నీ పూర్తయ్యే సరికి ముప్పయ్యేళ్లు వచ్చేస్తాయి. ఇరవైలలో పెళ్లి చేసుకోవడం మంచిదా? ముప్పయ్ లు వచ్చాక పెళ్లి చేసుకోవడం మంచిదా? అన్న విషయానికి వస్తే.. రెండింటిలోనూ లాభ నష్టాలూ కనిపిస్తాయి. ఇరవై లలో పెళ్లి చేసుకుంటే.. పెళ్లి చేసుకున్న మొదటిలో బాగానే ఉంటుంది. కానీ, కుటుంబ అవసరాలు పెరిగే కొద్దీ ఇద్దరి మధ్యా మనస్పర్థలు, గొడవలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి.
Advertisement
అదే ముప్పయ్యేళ్లు వచ్చేసరికి వీటన్నిటిని అర్ధం చేసుకునే మెచూరిటీ వస్తుంది. అయితే.. లేటు వయసులో పెళ్లి చేసుకునేటప్పుడు పిల్లల గురించి ప్లానింగ్ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే.. ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లి చేసుకుంటే.. పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకోవడం మంచిదే అయినా.. మరీ వయసు ముదిరిన తరువాత పెళ్లి చేసుకుంటే నిజమైన సంతోషాలను పొందలేము. ఓ సర్వే ప్రకారం.. పెళ్లి చేసుకోవడానికి 25 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు అనువైనది. మరీ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం కూడా అంత మంచిది కాదు. జీవితంలో నిలదొక్కుకోగలం అన్న ధైర్యం వచ్చాక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.
Read More:
ప్రభుత్వం మారగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా? అసలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారా ?
Prashanth Neel Movies: ప్రశాంత్ నీల్ సినిమాలు… డార్క్ కలర్ లో ఉండడానికి కారణం ఏమిటి..?