Advertisement
2022 సంవత్సరం అస్సలు వచ్చి రావడం లేదు. ఈ సంవత్సరం మహేష్ బాబు కుటుంబానికి చాలా చెత్త సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం లో రమేష్ బాబు, ఇందిరా గారు మరియు ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. ఈ ముగ్గురు కాదు కొందరు తెలుగు వారు మరియు వారి ఆకస్మిక మరణం వారి,వారి కుటుంబ సభ్యులను, అభిమానులను మరియు ఇతరులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, 2022లో ఈ 10 మంది తెలుగు సెలబ్రిటీల ఆకస్మిక మరణాలు వారి కుటుంబాలు & అభిమానులను షాక్కు గురి చేశాయి. వారి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!
1. మేకపాటి గౌతమ్ రెడ్డి
మేకపాటి గౌతం రెడ్డి ఈ ఏడాదే అనుకోకుండా మరణించారు. నిత్యం జిమ్ చేసే ఆయన.. హార్ట్ ఎటాక్ రావడంతో, మరణించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలా చనిపోతారని ఎవరు ఊహించి ఉండరు.
2. ఘట్టమనేని కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ… ఆయన మరణంతో టాలీవుడ్ తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటు కారణంగా మరణించారు. దీంతో మహేష్ బాబు ఫ్యామిలీ… ఒంటరి అయిపోయింది.
3. కృష్ణంరాజు
ప్రభాస్ పెదనాన్న, టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు గత నెలలో మరణించారు. ఆయన కూడా ఒక్కసారిగా మరణించి, టాలీవుడ్ చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టు వేశారు. ఆయన చనిపోయిన నెలరోజులకే కృష్ణ గారు మరణించడం జరిగింది.
4. రమేష్ బాబు
Advertisement
2022 సంవత్సరం మొదట్లో… కృష్ణ గారి కుమారుడు రమేష్ బాబు మరణించారు. ఆయన ఓ అరుదైన వ్యాధి కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కుటుంబం అనాధగా మారిపోయింది.
5. ఘట్టమనేని ఇందిరా (మహేష్ బాబు )
మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా… నెల రోజుల కిందట మరణించింది. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే నెల రోజుల కిందట ఇందిరా దేవి మరణించారు.
6. యూట్యూబర్ గాయత్రి
యూట్యూబర్ గాయత్రి కూడా ఇదే సంవత్సరం మరణించారు. హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయత్రి మృతి చెందారు. హోలీ పండుగ అయిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది.
7. Mannava Balayya
టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య. ఈయన ఎప్పటినుంచో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలలో నటించారు. తండ్రి అలాగే తాతల పాత్రలో కూడా బాగా కనిపించారు. అయితే ఈయన కూడా ఇదే సంవత్సరం మరణించారు.
8. నందమూరి ఉమామహేశ్వరి
నందమూరి ఉమామహేశ్వరి కూడా ఇదే సంవత్సరం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆమె మతిస్థిమితం సరిగా లేక, ఉమామహేశ్వరి మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉమామహేశ్వరి మరణంతో నందమూరి ఫ్యాన్స్ బిగ్ షాక్ లోకి వెళ్లారు.
9. DMK మురళి
టాలీవుడ్ నటుడు, ప్రముఖ జర్నలిస్టు మురళి కూడా ఇదే నెలలో మృతి చెందారు.
10. గురు స్వామి – మహర్షి తాత
టాలీవుడ్ నటుడు గురుస్వామి ఈ సంవత్సరం మరణించాడు. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడి మృతి చెందారు. మహర్షి సినిమా లో గురు స్వామి చాలా బాగా యాక్టింగ్ చేశాడు.