Advertisement
పూర్వం ఆడవారిని వంటగదికే పరిమితం చేసేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది నారీ శక్తి అనేది విశ్వమంతా వ్యాపించింది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు మనం మహిళా ఉద్యోగులను ఆర్టీసీ బస్సులో కండక్టర్లుగా చూసి ఉంటాం. కానీ మహిళా డ్రైవర్లను చూసి ఉండరు. కానీ మహిళలు తలుచుకుంటా ఏదైనా సాధించగలరని నిరూపిస్తుంది ఓ యువతి. పురుషులు మాత్రమే అధికంగా ఉండే డ్రైవింగ్ ఫీల్డ్ ని వృత్తిగా ఎంచుకొని అందరితో శభాష్ అనిపించుకుంటుంది.
Advertisement
తమిళనాడు కోయంబత్తూరులో బస్సు నడుపుతూ అక్కడి జనాన్ని ఆకట్టుకుంటుంది షర్మిల. ఈమె బస్సు నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోయంబత్తూరులో తొలి మహిళా బస్సు డ్రైవర్ గా ఈ యువతి రికార్డు సృష్టించింది. గాంధీపురం – సోమనూరు రూట్ లో బస్సు నడుపుతున్న ఈ యువతీని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా, వాడవల్లి లోని తిరువల్లూరు నగర్ కు చెందిన 24 ఏళ్ల ఎం షర్మిల బ్రతుకుతెరువు కోసం ప్రైవేట్ బస్సు స్టీరింగ్ పట్టుకుంది. ఆటో డ్రైవర్ అయిన తండ్రి మహేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకొని మొదట ఆటో డ్రైవ్ చేసింది. తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆ తరువాత బస్సు డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంది. దీనికి తండ్రి కూతురికి అండగా నిలబడ్డాడు. ఆ అనంతరం బస్సు డ్రైవర్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న షర్మిల.. భారీ వెహికల్స్ నడపడానికి అధికారిక శిక్షణతో పాటు లైసెన్స్ కూడా సంపాదించింది.
Advertisement
భారీ వాహనాల డ్రైవింగ్ లో పురుషాదిక్య రంగంలో తనదైన ముద్ర వేయాలనుకుంటున్నట్లు షర్మిల తెలిపింది. ఏడవ తరగతి చదువుకున్నప్పుడే డ్రైవింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగిందని తెలిపింది షర్మిల. 2019 నుండి కోయంబత్తూరు లో ఆటో డ్రైవ్ చేస్తున్నట్లు.. హెవీ వెహికల్ లైసెన్స్ రావడానికి తన తండ్రి కారణమని చెప్పింది షర్మిల. ఇక డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో ప్రాక్టీస్ కి వెళ్ళినప్పుడు ఆమె నడిపే బస్సు పైపు నవ్వుతూ చూసిన వారంతా ఈరోజు ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలిపింది. ఈ యువతి బస్సు నడపడం చూసి అక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు. స్థానికులు శభాష్ షర్మిల అంటూ అభినందిస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లెక్కచేయకుండా మహిళలు కష్టపడి పైకి రావాలని చెబుతుంది షర్మిల.
Read also: చాణక్య నీతి ప్రకారం పురుషులకంటే మహిళలు ఈ 4 విషయాలలో ముందుంటారట !