Advertisement
ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జిల్లాల పర్యటనల్లో ఉన్నారు చంద్రబాబు. రోడ్ షోలు, మీటింగ్ లతో జనానికి పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి తన హయాంలో చేసిన పనులన్నీ ఏకరువుపెడుతున్నారు. అయితే.. వరుస తొక్కిసలాట ఘటనలు అటు టీడీపీ శ్రేణులను, ఇటు చంద్రబాబును కలవరపెడుతున్నాయి.
Advertisement
ఈమధ్యే కందుకూరులో చంద్రబాబు సమక్షంలోనే తొక్కిసలాట జరిగింది. విపరీతంగా జనం రావడంతో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలబడ్డారు. అయితే.. దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది నడుస్తుండగానే మరోసారి చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. కాకపోతే ఈసారి ఆయన సమక్షంలో జరగలేదు.
Advertisement
గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ జరిగింది. జనం భారీగా తరలివచ్చారు. వైసీపీ పాలనపై బాబు స్పీచ్ ఇచ్చారు. అలాగే తమ హయాంలో తీసుకొచ్చిన పథకాలను వివరించారు. చివరిలో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత గందరగోళం నెలకొంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు.
సభా వేదిక దగ్గర ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కానుకల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడ్డారు. తోపులాట జరిగి పలువురు స్పృహ తప్పి పడిపోయారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.