Advertisement
నేరం ఏమైనా చేస్తే శిక్ష పడుతుందని తెలుసు కానీ నేరం చేయకుండా అన్యాయంగా శిక్ష పడడాన్ని చూసారా..? ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 301 రోజులు జైలు జీవితం గడిపారు. ఒక్కొక్కసారి అంతే ఏ తప్పు చేయకపోయినా పోలీసులకి అనుమానం రావడం జైలు శిక్ష పడడం వంటివి జరుగుతాయి. సినిమాల్లో చూపించినట్లు బయట కూడా అన్యాయం చేయకపోయినా శిక్ష పడుతుంది. నిర్దోషి అని తెలిసిన తర్వాత అయ్యో అంటారు. అయితే ఇక పూర్తి వివరాలను చూసేద్దాం..
Advertisement
పేదవాళ్ళగా పుట్టడమే వీళ్ళ తప్పైపోయింది నిర్దోషులమని నిరూపించుకోవడానికి శక్తి కూడా లేకపోయింది. అడుగు అడుగున ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ జంటకి. ఏ తప్పు చేయకపోయినా జైలు జీవితం గడిపారు. ఈ జంట మొత్తం 301 రోజులు పాటు జైల్లో ఉండి తర్వాత నిర్దోషిలను తెలిసిన తర్వాత బయటకి వదిలేసారు. చేయని నేరానికి దాదాపు పది నెలల పాటు శిక్ష పడింది.
Advertisement
పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ కు చెందిన పలాష్, శుక్ల అధికారి బెంగళూరుకి కూలీల కింద వచ్చారు ఈ దంపతులకు రెండేళ్ల పాప కూడా ఉంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులన్న అనుమానంతో 2022 జూలై నెల లో బెంగళూరు పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు విదేశీయుల చట్టం కింద కేసును నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ దంపతులు ఎంత మొత్తుకున్నా నేనేం తప్పు చేయలేదని చెప్పినా కూడా పోలీసులు వాళ్ళ మాట వినలేదు.
బెంగళూరు నగరుశివారులో ఉన్న సెంట్రల్ జైలుకి పంపించారు తర్వాత పోలీసులు వీళ్ళ ఇంటిని చెక్ చేశారు. స్థానిక జమాల్ పూర్ బీడీఓను సంప్రదించారు అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ని సరిచూసుకున్నారు. వీళ్ళ బంధువులు బెంగళూరు కి చేరుకునే బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది ఫైనల్ గా ఈ దంపతులకి ఏప్రిల్ 28న బెయిల్ మంజూరు అయింది భూమి పత్రాలని లేటుగా సబ్మిట్ చేయడంతో మే 24న జైలు నుండి రిలీజ్ అయ్యారు. ఆఖరికి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. శుక్ల అధికారి సోదరి వీళ్ళకి ఎంతగానో సహాయపడ్డారు బ్యూటీ పార్లర్ నడుపుతూ ఆమె సంపాదనని ఈ కేసు కోసం ఖర్చు పెట్టారు.
Also read:
కన్న తల్లినే చంపేసిన కసాయి కూతురు ! ఇలా కూడా ఉంటారా ? ఇందులో ట్విస్ట్ ఏంటంటే ?