Advertisement
ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా అయోధ్య రామాలయం గురించే మాట్లాడటం విశేషం. కోట్లాది మంది ఆకాంక్ష ఇవాళ నెరవేరింది. సుదీర్ఘ పోరాటం, న్యాయ వివాదాల తరువాత ఇవాళ అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది. దీని వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామాలయం నిర్మాణాన్ని ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
Advertisement
ముఖ్యంగా 32 ఏళ్ల కిందటే ప్రధాని మోడీ ఒక శపథం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించిన తరువాతనే తిరిగి అయోధ్యకి వస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు అది నిజమైంది. నేడు కోట్లాది మంది ప్రజల సాక్షిగా ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరించనున్నారు. నాడు రామ జన్మ భూమిలో మోడీ పర్యటన.. అక్కడ పరిస్థితుల్లో చేసిన ప్రతిజ్ఞ.. నాటి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 32 ఏళ్ల కిందట మోడీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. రామమందిరం గురించి సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి ఆ యాత్ర నిర్వహించారు.
Advertisement
జై శ్రీరామ్ నినాదాల మధ్య.. నరేంద్ర ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామమందిరం కట్టినప్పుడే తిరిగి వస్తానన్నారు. అయోధ్య రామాలయం కోసం ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. అయోధ్య లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల దీక్ష చేశారు. దేశ వ్యాప్తంగా ఆలయాలను సందర్శించారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట తరువాత ప్రధాని మోడీ దీక్ష విరమించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృత్ ను ప్రధాని మోడీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తాగించారు.