Advertisement
సాధారణంగా క్రికెట్ లో రకరకాల రికార్డులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఒకే ఓవర్ లో మ్యాజిక్ లు జరుగుతుంటాయి. కొన్ని సార్లు హ్యాట్రిక్ జరిగితే.. మరికొన్ని సార్లు 6 బాళ్లకు 6 సిక్స్ లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు రకరకాల రికార్డులు నమోదు అయ్యాయి. తాజాగా కాబుల్ ప్రీమియర్ లీగ్ లో అప్గనిస్తాన్ బ్యాటర్ సెడిఖుల్లా అటల్ ఓ రికార్డు నెలకొల్పాడు. ఓకే ఓవర్ లో 7 సిక్స్ లు బాదాడు. ఒకే ఓవర్ లో 48 పరుగులను సమర్పించుకున్నాడు స్పిన్నర్ అమీర్ జజాయ్.
Advertisement
Advertisement
లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ సెడిఖుల్లా ఓవర్ తొలి బంతినే సిక్సర్ గా బాదాడు. అది నో బాల్ కావడంతో కౌంట్ కాకపోగా.. మరో ఎక్స్ ట్రా పరుగు కూడా వచ్చింది. ఇక ఆ తరువాత బంతిని అమీర్ జజాబ్ వైడ్ వేయడంతో అది కూడా కౌంట్ కాకుండానే 12 పరుగులు వచ్చాయి. మిగిలిన 6 బంతులను సెడిఖుల్లా 6 సిక్సర్లుగా మలిచాడు. ఒకే ఓవర్ లో 7 సిక్సులు కొట్టిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. సెడిఖుల్లా ఏకంగా 118 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 10 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి.
విధ్వంసంతో షాహీన్ హంటర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం అబాసిన్ డిఫెండర్స్ 18.3 ఓవర్లలో కేవలం 121 పరుగులకే కుప్పకూలింది. షాహీన్ హంటర్స్ జట్టు ఏకంగా 92 పరుగుల భారీ తేడా ఘన విజయం సాధించింది. ఇటీవలే సెడిఖుల్లా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. మరోవైపు భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫిలో ఒకే ఓవర్ లో 7 సిక్సర్లను బాది రికార్డు సృష్టించాడు.