Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొందరికి ఊహించని విజయం లభిస్తే మరికొందరికి అనుకోని పరాజయం ఎదురైంది. జోరు మీదున్న కారుకి బ్రేకులు పడితే హస్తం గుర్తు పార్టీకి పగ్గాలు లభించాయి. అయితే.. బిఆర్ఎస్ పార్టీ పరాజయం వెనుక ఉన్న ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి చావుకి, కౌరవుల ఓటమికి వంద కారణాలు ఉన్నట్లే.. బిఆర్ఎస్ పార్టీ పరాజయానికి కూడా బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. అయితే.. ప్రధాన కారణంగా కాంగ్రెస్ పార్టీ “మార్పు నినాదం” కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రకటనావళిలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అన్న సారాంశం బాగా వినిపించింది. పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో బిఆర్ఎస్ లోని కనీసం పాతిక మంది ఎమ్మెల్యేలతో ప్రజలు బాగా విసిగిపోయారని.. వారిని మార్చడం మంచిది అన్న సూచనలు వచ్చినా.. బిఆర్ఎస్ పార్టీ వారికే పట్టం కట్టి మళ్ళీ టికెట్స్ ఇవ్వడంతో ప్రజల్లో అసహనం మొదలైందని తెలుస్తోంది.
Advertisement
అయితే.. బీజేపీలో టికెట్స్ రాక తగినంత గుర్తింపు పొందలేదన్న అసంతృఫ్తీ తో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుని టికెట్స్ ఇచ్చింది. అది కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చినట్లైంది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ బిఆర్ఎస్ ను ప్రజల్లో పలచన చేసింది. ఆ తరువాత బండి సంజయ్ ను మార్చడం.. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ తో రాజీ వంటి అంశాలు కాంగ్రెస్ కు యుద్ధాన్ని మరింత పటిష్టం చేయడానికి తోడ్పడ్డాయి. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వాగ్దానాల విషయంలో బిఆర్ఎస్ వాగ్దానాలు నెరవేరకపోవడంతో వీటిపైనా ఆశలు పెట్టుకున్న ప్రజలు బిఆర్ఎస్ ని నమ్మలేదు. ఇక దళిత బంధు పధకం అమలులో జరిగిన లోటుపాట్లు, అవినీతి కూడా బిఆర్ఎస్ ఓటమికి ఓ కారణం అయ్యింది. యువత, నిరుద్యోగుల అసంతృప్తి కూడా బిఆర్ఎస్ ఓటమికి కారణమైంది.
Read More:
సినిమా రీమేక్ కాదు అన్నారు కదా ప్రశాంత్ నీల్ ? మరి ఈ కన్ఫ్యూషన్ ఏంటి ?
ఒకరు సీఎం, మరొకరు కాబోయే సీఎం ఈ ఇద్దరినీ ఓడించిన ఈయన ఎవరో తెలుసా ? :