Advertisement
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు ఎక్కువ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి జంటలు ఎన్నో ఉన్నాయి.. అలాగే పెళ్లి విషయంలో చాలామంది బయట వ్యక్తులు వారి యొక్క సొంత బంధువుల్లోనే అమ్మాయిలను చూసుకొని వివాహం చేసుకుంటారు. కానీ ఇండస్ట్రీలో కూడా ఈ ఆరుగురు హీరోలు వారి యొక్క సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్నారు. మరి వారు ఎవరో ఒకసారి చూద్దాం.
Advertisement
ఎన్టీఆర్-బసవతారకం:
అన్నగారు ఎన్టీఆర్ తన సొంత మరదలు అయిన బసవతారకంను 1942లో పెళ్లి చేసుకున్నారు. ఈయన సినిమాల్లోకి రాకముందే వివాహం జరిగింది.
also read:రిలయన్స్ అధినేత అంబానీ ఆస్తుల్లో విలాసవంతమైన వస్తువులు ఇవే
మోహన్ బాబు-విద్యా దేవి & నిర్మలా దేవి :
కలెక్షన్ కింగ్ గా పేరు పొందిన మోహన్ బాబు తన సొంత మరదలైన విద్యా దేవి ని పెళ్లి చేసుకున్నారు. ఆమె అనుకోకుండా మరణించడంతో, తన సోదరి అయిన నిర్మలా దేవిని వివాహం చేసుకున్నారు.
కృష్ణ-ఇందిరా :
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ కూడా సినిమాల్లోకి రాకముందే తన మరదలు ఇందిరాదేవిని వివాహమాడారు.ఈయన పెళ్ళైన నాలుగు సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి వచ్చారు.
కార్తీ-రజిని :
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరుంది. ఈయన కూడా 2011లో తన సొంత మరదలిని వివాహం చేసుకున్నారు.
ఏఎన్ఆర్-అన్నపూర్ణ :
అక్కినేని సొంత మరదలు అయినా అన్నపూర్ణను 1949లో వివాహం చేసుకున్నారు. అప్పటికే ఏఎన్నార్ సినిమాలు విడుదలై రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
ఆది-అరుణ :
సాయికుమార్ కుమారుడు హీరో ఆది సినిమాల్లోకి రాకముందే అండర్-19 క్రికెట్ ను ఆడారు. ఈయన తన మేనమామ కుమార్తె అయిన అరుణను 2014లో వివాహం చేసుకున్నారు.
also read:వెంకటేష్ కొడుకు.. అర్జున్ దగ్గుబాటి ఎంత అందంగా ఉన్నాడో చూసారా?