Advertisement
ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి.. మొన్నటికి మొన్న హైదరాబాదులోని అంబర్ పేట్ లో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ను కుక్కలు ఎలా వెంబడించి పీక్కుతున్నాయో మనమందరం చూసాం. ఆ ఘటన చూస్తే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి భయం వేసిందని చెప్పవచ్చు. ఈ ఘటన మరువక ముందే సిద్దిపేట జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కానీ ఇందులో ఆ పాప తృటిలో తప్పించుకుందని చెప్పవచ్చు. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..
Advertisement
Also Read: కృష్ణవంశీ రమ్యకృష్ణ ల మధ్య లవ్ సెట్ అయింది ఆ కమెడియన్ వల్లేనా..?
మొన్న అంబర్ పేట్ ఘటన చూసిన తర్వాత తల్లిదండ్రులు చిన్నపిల్లలను బయట విడిచి పెట్టాలంటే జంకుతున్నారు. అయితే కుక్కల స్వైర విహారం అనేది ఎక్కువ అయింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్న సమయంలో ప్రజలంతా కుక్కలను కట్టడి చేయాలని ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తున్నారు. అయితే తాజాగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పాత బస్టాండ్ సమీపంలో నాలుగో తరగతి చదువుతున్న 9 ఏండ్ల బాలిక పాలు తీసుకురావడానికి షాప్ కు వెళ్తున్న క్రమంలో రెండు వీధి కుక్కలు చాలా దారుణంగా ఆ బాలికపై దాడి చేయ సాగాయి. దీంతో ఆ బాలిక భయానికి గురై కింద కూడా పడిపోయింది.
Advertisement
Also Read: కమెడియన్ రఘు ఇల్లు చూశారంటే దిమ్మ తిరిగిపోద్ది..!!
అయినా కుక్కలు ఆ పాపని విడిచిపెట్టకుండా వెంబడించాయి. కానీ ఆ పాప ధైర్యంతో అటు ఇటు కుక్కలను భయపెడుతూ తిప్పుతూ వచ్చింది. చివరికి కింద పడిపోవడంతో అవి దాడి చేసే లోపు పక్కనే వైండింగ్ మెకానిక్ తొందరగా ఇది గమనించి కుక్కలను బెదిరించి బాలికను కాపాడాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ దాడిలో బాలిక చిన్న చిన్న గాయాలతో బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఇది చూసిన వారంతా అమ్మాయి చాలా గ్రేట్ అంటూ, అలాగే మెకానిక్ ను కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.