Advertisement
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బీడ్’ ట్యాగ్ లైన్, పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి, కరణ్ జోహార్, హీరూ యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే హీరో విజయ్ దేవరకొండ లైగర్ విషయంలో బాగా హడావిడి చేశాడు. ఎంతగా అంటే విడుదలే తరువాయి మూవీ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అన్నట్లు యాటిట్యూడ్ చూపించాడు. తీరా సినిమా విడుదలయ్యాక అందరి గాలి పోయింది. లైగర్ మూవీలో అసలు విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. అసలు ఇది పూరి మార్క్ సినిమా కాదు, ఆయనేనా తీసింది అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైగర్ ఫెయిల్ పై పూరికి ఆయన అభిమాని సంచలన లేఖ రాశాడు. ఇప్పుడు ఆ లేఖ వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే..
Advertisement
“పూరి, ముందుగా ఇలా మాట్లాడుతున్నందుకు ఐ యామ్ సారీ, నేను నీ సినిమాలకు పెద్ద అభిమానిని
చాలా కాలంగా నేను ‘లైగర్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. మొదటి రోజు కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా చూడలేకపోయాను. మొదటి రోజు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా సినిమా బాలేదు, మీ వాడి పని అయిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్లూక్ హిట్ అంటూ రకరకాల విమర్శలు చేశారు. అవి ఏమి నేను పట్టించుకోలేదు. అయినా సరే ఒక్క రివ్యూ కూడా చదవకుండా నేను ఆదివారం రోజున థియేటర్ కూ వెళ్లి సినిమా చూశాను. నాతో పాటు ఎవ్వరిని తీసుకెళ్లలేదు. నేను సినిమా ఫోకస్డ్ గా చూడాలి. నీ సినిమాల్లో ఉండే ఫిలాసఫీ నీ అర్థం చేసుకోవాలి అనేది నా ప్రధాన ఉద్దేశం. అలానే వెళ్లాను, సినిమా చూశాను. సినిమా ఫ్లాప్ అయినందుకు, ఫ్రెండ్స్ బాలేదు అన్నందుకు నేను ఏ మాత్రం బాధపడలేదు. ఏ దర్శకుడికి అయినా హిట్స్, ప్లాప్స్ అనేవి కామన్.
Advertisement
కాకపోతే నేను బాధపడిందల్లా, నాకు తెలిసిన పూరి మార్క్, నేను ఎంజాయ్ చేసే పూరి టేకింగ్, ఈ సినిమాలో కనిపించలేదు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాన్ని ఎవరో బాలీవుడ్ డైరెక్టర్ రీమేక్ చేసి, మళ్లీ దాన్ని తెలుగులోకి డబ్ చేసినట్టు ఉంది సినిమా. నీ మార్క్ ఎలా మిస్ అయ్యింది పూరి? ‘గోలీమార్’ లో ఓ మంచి డైలాగ్ రాశావు. ’10 మందిని మోసం చేస్తే నువ్వు కనీసం బాగుపడతావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంక నాకి పోతావు’ అని! నా కర్మ నువ్వు రాసిన డైలాగ్ నేను నీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అర్జెంటుగా నీ టీమ్ ని మార్చేయి. లేదు అంటే వాళ్లను నిజాలు చెప్పమని చెప్పు. ‘అవును అంటే అవును, కాదు అంటే కాదు, బాగుంటే బాగుంది అని బాలేదు అంటే బాలేదు అని చెప్పమను. నీ సినిమాలు ప్లాప్ అయినా వాటికీ, నీకు ఓ రెస్పెక్ట్ ఉంటుంది పూరి. ‘లైగర్’ సినిమాకి అది దక్కలేదు అని నా బాధ. నువ్వు తీసిన ‘రోగ్’ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఇంత ఇబ్బంది కలగలేదు. ‘లైగర్’ కి చాలా డిసప్పాయింట్ చేశావు.
మొన్న సుకుమార్ తో కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం గురించి చాలా బాగా చెప్పావు. కాదు కాదు గొప్పగా చెప్పావు. కానీ నువ్వెప్పుడు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తావు? నువ్వు ఇప్పుడు పూర్తిగా కంఫర్ట్ జోన్ లో ఉండిపోయావు తెలుసా? ఆ ‘పూరి కనెక్ట్సు’ నుండి బయటకు వచ్చి ఓ సినిమా తీయి. ఇది నా హార్ట్ ఫుల్ రిక్వెస్ట్. మాకు నువ్వు ప్రతిసారి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వనవసరం లేదు. నాకు వింటేజ్ పూరిని చూపించు. కనీసం చూపించడానికి ట్రై చెయ్యి. ప్రతిసారి ‘ఇడియట్’, ‘పోకిరి’ అవసరం లేదు. కడుపు మండితే ‘బిజినెస్ మెన్’ సినిమా తీశాను అని చెప్పావు కదా. నాకు కడుపు మండి ఇలాంటి లెటర్ రాస్తున్నాను. ‘బిజినెస్ మెన్’ లాంటి సినిమా ఒకటి ఇవ్వు. ‘ఐ వాంట్ వింటేజ్ పూరి’ ” అంటూ అందులో పేర్కొన్నాడు.
READ ALSO : తెలంగాణ లో కోమటి రెడ్డి సత్తా ఎంతో ప్రియాంక ఒక అంచనాకి వచ్చారా ?