Advertisement
సాధారణంగా ఒక్కొక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఒకటి రెండు భాషలు మాట్లాడాలంటేనే మనం ఇబ్బంది పడుతుంటాం. కానీ ఈ బాలిక మన దేశ భాషలు మాత్రమే కాదు.. విదేశీ భాషల్లో కూడా మంచి పట్టు సంపాదించింది. విదేశీయులకే తర్జుమా చేస్తూ భాషపై తనకు ఉన్న ప్రావీణ్యాన్ని చెప్పకనే చెబుతోంది. ఏకంగా ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.. రాయగలుగుతుంది. చిన్న వయస్సులోనే ఆరు భాషలు నేర్చుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Advertisement
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కారంపల్లి అనే చిన్న గ్రామంలో పుట్టిన మన్నూరు ఇందు రెడ్డి.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. బాలిక తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు మాత్రమే కాకుండా విదేశీ భాషలపై కూడా మంచి పట్టు సాధించింది. దాదాపు 6 విదేశీ భాషలపై అపర ప్రావీణ్యం సంపాదించింది. జపనీస్, థాయ్, కొరియన్, చైనిస్ భాషలను మాట్లాడటంతో పాటు చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చే వైద్యులకు ఆమె తర్జుమా చేస్తూ.. తన భాష ప్రావీణ్యాన్ని చాటుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టార్ హోటల్ సిబ్బందికి ఆమె విదేశీ భాషలను నేర్పుతూ చిన్న వయస్సులోనే తన భాషా ప్రావీణ్యంతో అబ్బురపరుచుతుంది. భాష నేర్చుకోవాలన్న పట్టుదలతో పలు మాధ్యమాల ద్వారా కష్టపడి సొంతంగానే విదేశీ భాషల్లో నేర్చుకున్నట్టు తెలిపింది.