Advertisement
ప్రేమ రెండు అక్షరాలు. ఈ రెండు అక్షరాల ప్రేమనే కొన్ని సార్లు రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంటది. మరికొన్ని సార్లు రెండు కుటుంబాలు చాలా సంతోషంగా గడుపుతాయి. నిజం చెప్పాలంటే ఈ ప్రేమ అనేది ఒక వ్యసనం అనే చెప్పాలి. తాగుబోతు కూడా మద్యం సేవించినప్పుడు మత్తులో ఎలా ఉంటాడో.. ప్రేమికులకు అలాగే ప్రేమలో ఉన్నప్పుడు మత్తు ఉంటుంది.
Advertisement
ఆ ప్రేమ మత్తులో కూరుకుపోతే ఈ ప్రపంచం ఏమైపోతున్నా కూడా పట్టించుకోరు. ఇక అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. కానీ ప్రస్తుతం కా* ముసుగులో ప్రేమలో పడుతున్నారు. కేవలం శారీరక సౌందర్యం చూసి.. చిన్న చిన్న గిప్ట్ లు ఇచ్చి మభ్యపెట్టి.. మాయ మాటలతో అమ్మాయిలను వలలో వేసుకుంటున్నారు నేటి కాలం అబ్బాయి కొందరు. ఇది నిజమైన ప్రేమ అనుకొని వారి కోసం పడిగాపులు కాస్తూ.. వారికి నచ్చిన విధంగా నడుచుకోవడం చేస్తున్నారు అమ్మాయిలు. దాదాపు రోజులో 10 గంటలకు పైగా ప్రేమికుడితో ముచ్చట్లతో మునిగి తేలిపోతుంటారు. చివరికీ అన్నీ అయిపోయిన తరువాత పెళ్లి విషయానికి వస్తే.. మొహం చాటేస్తున్నారు. అది ఏంటని ప్రశ్నిస్తే.. ప్రేమించేటప్పుడు రానీ సాకులన్నీ వెంటనే గుర్తకొస్తున్నాయి. అది విన్న అమ్మాయిలు తాము మోస పోయామని గ్రహించి చివరికీ చనిపోవడానికి కూడా వెనుకాడటం లేదు.
Advertisement
తాజాగా ప్రభుత్వ పాఠశాలల కాంట్రాక్ట్ టీచర్ గా విధులు నిర్వహించే ఓ యువతి ఒకే ఒక్క కారణంతోనే నిండు ప్రాణాలను తీసుకుంది. అదే ప్రేమ.. ప్రేమనే ఆమె పాటిట శాపమైంది. వివరాల్లోకి వెళ్లితే.. రంగారెడ్డి జిల్లాకి చెందిన కేతిరెడ్డిపల్లికి చెందిన అపర్ణ.. శివ అనే యువకుడిని ప్రేమించింది. ప్రేమలో ఉన్న సమయంలో వీరు చాలా సంతోషంగా గడిపారు. ఆ సమయంలోనే శివ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. కానీ అంతలోనే అపర్ణను కాస్త దూరం పెట్టి.. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇన్ని ప్రేమించిన వ్యక్తి తనను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్థాపానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లింది అపర్ణ. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
తమ్ముడు సినిమాలో నటించిన ఈ కమెడియన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?
ఫోన్ చూస్తూ లెక్చరర్ కి దొరికిన విద్యార్థిని.. ఇక ఆ తరువాత ఏం జరిగిందంటే ?
పక్కింటి వాళ్లు తిట్టినా.. భర్త పట్టించుకోలేదని భార్య ఏం చేసిందో తెలుసా ?