Advertisement
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఎన్ని శిక్షలు వేసిన వివాహేతర సంబంధాలు, లైంగిక దాడులు అస్సలు ఆగడం లేదు. ఐదు నిమిషాల సుఖం కోసం అఘాయిత్యాలకు పాల్పడి చివరికి జైలు పాలవుతున్నారు. ఇలాంటి సంఘటన రోజు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. వీళ్ళ తప్పుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, వెంటనే ప్రియురాలిని గర్భవతి చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది..
Advertisement
ఈ అవమానాన్ని తట్టుకోలేక పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏం చేసిందంటే.. కర్ణాటక రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లా ఒండికుప్పం గ్రామానికి చెందిన ప్రసాద్(28)కి పడపై ప్రాంతానికి చెందిన సమీప బంధువైన భవాని (24)తో 2019లో వివాహమైంది. ప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే కవిత అనే యువతీతో పరిచయం ఏర్పడింది, ఇది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. తరచూ ప్రసాద్ ఆమెతో మాట్లాడడం గమనించిన తన భార్య ఆయనతో గొడవపడి సంవత్సరం నుంచి వేరుగా ఉంటుంది.
Advertisement
రెండు వారాల క్రితం భవానికి ఫోన్ చేసిన కవిత తనకు ప్రసాద్‌కు మూడు నెలల క్రితం వివాహమైందని తాను మూడు నెలల గర్భవతి అని చెప్పింది. ఇది విని షాక్ అయిన భవాని తన భర్తను నిలదీసింది. దీంతో ఆయన సమాధానం చెప్పకపోగా ఆమెపై దాడి చేశాడు. మనస్థాపానికి గురైన భవాని ఉరివేసుకొని మరణించింది. వెంటనే భవాని తల్లిదండ్రులు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: