Advertisement
అనసూయ.. యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. సినిమాల విషయంలోనే కాదు.. సోషల్ మీడియా వివాదాలతోనూ ఈమె పేరు మార్మోగుతుంటుంది. తాజాగా అనసూయ ఫిర్యాదుతో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ నటీమణులపై ఇష్టం వచ్చినట్లు రాస్తున్న ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది అనసూయ.
Advertisement
సైబరాబాద్ పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని పట్టుకున్నారు. కోనసీమ జిల్లాకు చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. అతనిపై 354 (ఏ)(డీ), 559 ఐపీసీ సెక్షన్ 67 67(ఏ) ఐటీ యాక్ట్ 2000 2018 ప్రకారం కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
Advertisement
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ తో టాలీవుడ్ నటీమణుల ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నాడు వీర్రాజు. ఈక్రమంలోనే ఈనెల 17న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది యాంకర్ అనసూయ. నిందితుడు 267 అకౌంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తూ పిచ్చి రాతలు రాస్తున్నాడని తేలింది. ఇతని సొంతూరు కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామం.
గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ఫ్లంబర్ వర్క్ చేశాడు నిందితుడు. ఫిలిం ఇండస్ట్రీ యాంకర్స్, హీరోయిన్స్ ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నాడు. రోజా, అనసూయ, విష్ణుప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో బూతు రాతలు రాస్తున్నాడు. సదరు నటీమణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను ఇతను మళ్లీ పోస్ట్ చేసి అసభ్యకర రీతిలో రాస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.