Advertisement
మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. భారీ మెజార్టీ కాకపోయినా, మంచి మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టిఆర్ఎస్ పార్టీ. ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమీప ప్రత్యర్థి బిజెపికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏకంగా 10309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండు నుంచి చివరి రౌండ్ వరకు, రౌండ్ రౌండ్ కు టిఆర్ఎస్ స్పష్టమైన ఆదిత్యాన్ని కనబరిచింది. కారు స్పీడ్ తో కమలం రేకులు పోయాయి. అయితే, ఈ మునుగోడు ఎన్నికపై చాలా సర్వే సంస్థలు సర్వేలు చేశాయి. కానీ, ‘‘COPACT’’ సంస్థ చేసిన సర్వే మాత్రం 100 శాతం నిజమైంది. తుది రిజల్ట్స్ వచ్చాక కూడా ‘‘COPACT’’ సర్వేనే వాస్తవమని తేలింది.
Advertisement
‘‘COPACT’’ సంస్థ చేసిన సర్వే ఇదే !
Advertisement
మునుగోడు నియోజక వర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. ఈ ఏడు మండలాలలో ‘‘COPACT’’ సంస్థ రెండు సార్లు కింది స్థాయిలో సర్వే చేసింది. మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమైన గ్రామాలలో 3000 మంది నుంచి సమాచారం సేకరించింది. ఈ నేపథ్యంలోనే, టిఆర్ఎస్ పార్టీకి 41% ఓట్లు వస్తాయని అలాగే బిజెపి పార్టీకి 36% ఓట్లు వస్తాయని ఈ సర్వేలో తేల్చి చెప్పింది ‘‘COPACT’’. ఇక తుది ఫలితాలలో ‘‘COPACT’’ సంస్థ చెప్పినట్లుగానే టిఆర్ఎస్ పార్టీకి 41 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. మునుగోడు పోలింగ్ కు ముందు 15 రోజుల ముందు ఒక సర్వే, అలాగే పోలింగ్ కు నాలుగు రోజుల ముందు మరొక సర్వే నిర్వహించింది. ఈ రెండు సర్వేలలో కూడా ‘‘COPACT’’ సంస్థ చేసిన సర్వే ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చింది. ఈ సర్వే సంస్థ ఇవ్వని విధంగా ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇచ్చింది ‘‘COPACT’’ సంస్థ.
మునుగోడు నియోజక వర్గంలో ఏ పార్టీకి లాభాలు ఉన్నాయి, ఏ పార్టీకి నష్టాలు ఉంటాయో కూడా ఈ సర్వేలో చెప్పగలిగింది. దాదాపు ‘‘COPACT’’ సర్వే వెల్లడించిన విధంగా ఆయా మండలాల వారి ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘‘COPACT’’ తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ తరపున కీలక భూమిక కూడా పోషించింది ‘‘COPACT’’ సంస్థ. అప్పుడు కూడా ఖచ్చితమైన ఫలితాలను రాబట్టింది. ఇప్పుడు మునుగోడు లోనూ ‘‘COPACT’’ చెప్పిన విధంగానే టీఆర్‌ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది.
READ ALSO : కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇక సన్యాసమే ?