Advertisement
అల్లూరి సీతారామరాజు.. భారత స్వతంత్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, త్యాగధనుడు, స్వాతంత్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసి 1924 మే 7న శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు అమాయకులు, విద్యావిహీనులైన కొండ జాతి ప్రజలను ఒక్కతాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ ప్రభుత్వం పై యుద్ధం చేసిన అల్లూరి వంటి వారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు.
Advertisement
Read also: ఆ నలుగురు హీరోయిన్లు మెగాస్టార్ తో నటించడానికి ఒప్పుకోలేదు..కారణం..!!
అల్లూరి సీతారామరాజు మరణించి దాదాపు 5 తరాలు దాటిపోయినా ఆయన ఈ దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అలాంటి వీరుడిని పట్టిస్తే భారీ నజరానా ఇస్తామని అప్పటి ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసింది. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాడ్రంగిలో జన్మించారు. అయితే అల్లూరి పెరిగింది మాత్రం పశ్చిమగోదావరి జిల్లా మొగల్లులో. రామరాజు తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీ లో ప్రావీణ్యం పొందారు. 1917 లో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు అల్లూరి సీతారామరాజు.
Advertisement
అక్కడ మన్యం ప్రజల దీనస్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని ఆయన మన్యం ప్రజలను పురిగొల్పారు. బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవాగ్నిని రగించిన సీతారామరాజు.. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై తొలిసారి దాడి చేశారు. ఆ తర్వాత 23న కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ మూడు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి భారీగా ఆయుధాలను సేకరించుకుని.. స్వతంత్ర పోరాటం ప్రారంభించారు. ఇక అప్పటినుంచి వరుస పెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి సీతారామరాజు.
Read also: ఈరోజు వాతావరణం 26.04.2023: తెలంగాణ, ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు…!
ఈ విప్లవాన్ని ఎలాగైనా అణిచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. 1924లో మన్యానికి కొత్త కలెక్టర్ రూథర్ ఫర్డ్ ని నియమించింది. రూతర్ ఫర్డ్ రాగానే.. అల్లూరి దళానికి చెందిన వారిపై విరుచుకుపడ్డారు. అంతేకాదు అల్లూరి సీతారామరాజును పట్టి ఇచ్చిన వారికి భారీ నజరాణాలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ గెజిట్.. ప్రభుత్వ ప్రకటన అంటూ 20 – 04 – 1923లో అల్లూరి సీతారామరాజును పట్టించిన వారికి రూ. 10000 బహుమతి ఇవ్వబడునని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసి ఇప్పటికి 100 ఏళ్ళు దాటింది. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Read also: “విక్రమ్” సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించిన ఈ పిల్లడు ఎవరో తెలుసా..?