Advertisement
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కృష్ణ సినీ జీవితం శుభం సీన్ కి చేరుకుందని.. ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలోనే విడుదలైన నెంబర్ మూవీ మళ్లీ ఆయనకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా విజయం సాధించడానికి కారకుడు దర్శకుడు ఎస్.వీ.కృష్ణారెడ్డి. ఈ దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ అభిమాని కూడా. కృష్ణలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు కవర్ చేసి.. ఆయన సరికొత్త ఇమేజ్ ఏర్పడే విధంగా సినిమాలను మలిచారు.
Advertisement
ఆయన అభిమానులు కృష్ణను ఎలా చూడాలనుకుంటున్నారో అలా వారి ఊహలకు రూపకల్పనగా నెంబర్ వన్ చిత్రాన్ని రూపొందించారు. ఎస్వీ కృష్ణారెడ్డి. కాస్ట్యూమ్స్, లుక్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాలలో కూడా కుర్ర కృష్ణను చూపించారు. ఒక్కసారిగా వయస్సు తగ్గిపోయి పాతికేళ్ల యువకుడిగా మారిపోయిన కృష్ణను తెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. హీరో కృష్ణ నటించిన గత సినిమాలకు చాలా భిన్నంగా నెంబర్ వన్ మూవీని తీస్తాననే ముందే ప్రకటించి తన మాట నిలబెట్టుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ముఖ్యంగా ఒక సీన్ లో వాడిన డ్రెస్ మరో సీన్ లో వాడలేదంటే ఆయన లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో కృష్ణారెడ్డి ఎంత శ్రద్ధ తీసుకున్నారో చెప్పవచ్చు.
Advertisement
కృష్ణను చాలా విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లి చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నీగ్రో గెటప్స్ వేయించారు కృష్ణారెడ్డి. ఈ సినిమాకి నెంబర్ వన్ హీరోనా అని విమర్శించిన వారున్నారు. కానీ సినిమా చూసిన తరువాత ఎవ్వరూ మాట్లాడలేదు. కృష్ణ హీరోగా సౌందర్య మొదటిసారిగా నటించారు. ఈ మూవీలో కోట శ్రీనివాసరావుతో పాటు మహేష్ ఆనంద్ కూడా విలన్ గా నటించారు. శాడిస్ట్ విలన్ పాత్ర అది. మహేష్ ఆనంద్, బ్రహ్మానందం చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షఖులను తెగ నవ్వించాయి. 1994 సంక్రాంతి సినిమాల్లో నెంబర్ వన్ విజేతగా నిలిచింది. ఈ మూవీకి వారం రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు వారం తరువాత కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా సినిమాలు విడుదలయ్యాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మరాజు విడాకులంటూ సోషల్ మీడియాలో రూమర్స్.. ఇంతకు ఏం జరిగిందంటే..?
యాంకర్స్ నుండి హీరోయిన్స్ అయిన 3 సెలెబ్రెటీస్ వీరే..!