Advertisement
130 కోట్ల మంది గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన “నాటు నాటు” పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డుని ప్రకటించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటుకి ఈ అవార్డు రావడం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. 8 దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. ఈ అవార్డు దక్కాలి అంటే టాలెంట్ ఉంటే సరిపోదు. అందుకు తగ్గ డబ్బు కూడా ఖర్చు పెట్టాలి.
Advertisement
Advertisement
కానీ ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడానికి రాజమౌళి తెలివితేటలతో పాటు తన కొడుకు కార్తికేయ వర్క్ కూడా చాలా తోడ్పడిందని చెప్పవచ్చు. అందుకే ప్రస్తుతం దేశం మొత్తం కూడా రాజమౌళి పేరు మార్మోగిపోతుంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలామంది ఆస్కార్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో కమలహాసన్. ఈయన ఏడుసార్లు నామినేషన్ దశకు వెళ్లి చివరికి అవార్డు దక్కక బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే కమలహాసన్ సినిమాలను సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేసుకోకపోవడంతో అవి ఏవి కూడా నామినేషన్ దక్కించుకోలేకపోయాయి.
Read also: హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయిన మూవీ ఏదంటే ?
చివరికి షార్ట్ లిస్టు కూడా కాలేకపోయాయి. పైగా కమలహాసన్ ఆస్కార్ దక్కించుకున్న కూడా అతనిపై కొన్ని నెగటివ్ కామెంట్స్ తగ్గవు కదా. దీనికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక విమర్శల పాలయ్యారు. రాజకీయ విషయాల్లో కూడా చాలా సార్లు టంగు స్లిప్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ గా అతని పాలిటిక్స్ కెరియర్ ముగిసింది. ఇక కమల్ ఆస్కార్ కోసం ప్రయత్నించిన సాగర్ హిందీ సినిమా మొదటిసారి నామినేషన్ కి వెళ్లి బంగపడింది. ఆ తర్వాత క్షత్రియ పుత్రుడు, భారతీయుడు, ద్రోహి, స్వాతిముత్యం, హే రామ్ వంటి సినిమాలకు ఆస్కార్ కు దరఖాస్తు చేసుకున్నారు.
Read also: “కొమరం భీముడొ” పాటలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ కొరడాతో కొట్టడం వెనక ఇంత స్టోరీ ఉందా ?