Advertisement
ఈ సమాజం రోజు రోజుకు ఏమవుతుందో తెలియకుండా పోతుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి ఎదుగుదలకు అండగా నిలవాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల యమధూతలుగా మారుతున్నారు. కొంత మంది ఒత్తిడితో కూడిన చదువులు చదవలేక కొందరూ.. మరికొందరూ తోటివారు ముందు హేళనకు తట్టుకోలేక తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. తాము తప్పులు చేస్తే పెద్ద మనస్సు చేసుకొని సున్నితంగా చెప్పాల్సిన లెక్చరర్స్ చాలా కాఠిన్యంగా వ్యవహరిస్తుండటంతో మనస్థాపానికి గురై విద్యార్థులు ఉరి కొయ్యెలకు వేలాడుతున్నారు. కళాశాలలో కొన్ని పాలిటిక్స్ వల్లనే విద్యార్థులు బలి అవుతున్నారు.
Advertisement
ల్యాబ్ సెషన్ లో విద్యార్థిని ఫోన్ తీసిందని కోపపడిన అధ్యాపకుడు.. ఆమె ఫోన్ లాక్కోవడంతో పాటు తిట్టడంతో ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన కేరళలోని కంజిరపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. అమల్ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఫుడ్ టెక్నాలజీ చదువుతున్న విద్యార్థిని శ్రద్ధా సతీష్ (20) జూన్ 02న కళాశాలకు వెళ్లింది. కళాశాలలో ల్యాబ్ సెషన్ ఉండగా ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఫోన్ బయటికి తీసింది. అక్కడే ఉన్న అధ్యాపకులు ఆమె ఫోన్ లాక్కుని.. హెచ్ఓడీ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అసలు ఏం జరిగిందో మాత్రం తెలియదు. కానీ ఆ తరువాత కళాశాలకి చెందిన హాస్టల్ లో విగత జీవిగా కనిపించింది శ్రద్ధా.
Advertisement
కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ.. తోటి విద్యార్థులు నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కావాలనే ఆ విద్యార్థిని ని టార్గెట్ చేయడంతో చనిపోయిందని తోటి విద్యార్థులు ఆరోపించారు. కళాశాలకు సంబంధించి గతంలో ఓ ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్న శ్రద్ధా తన అభిప్రాయాన్ని పంచుకుంది. దీంతో అప్పటి నుంచి కళాశాల యాజమాన్యం మనస్సులో పెట్టుకొని వేధిస్తున్నారని తోటి విద్యార్థులు వాపోతున్నారు. రెండు రోజులు తమతో సంతోషంగా ఉండి వెళ్లి వెళ్లిన కుమార్తె అదె రోజు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి రోదనలు బాధకలిగిస్తున్నాయి. కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అంబటి రాయుడు తెలుగు విని ఆశ్ఛర్యపోయిన హీరో నాని..!
పక్కింటి వాళ్లు తిట్టినా.. భర్త పట్టించుకోలేదని భార్య ఏం చేసిందో తెలుసా ?
తమ్ముడు సినిమాలో నటించిన ఈ కమెడియన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?