Advertisement
సాధారణంగా మనం ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే రైల్ టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. కొన్ని నెలల నుంచి చాలామంది ముందస్తుగా బుక్ చేసుకొని ఉంటారు.. ఈ సమయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి టికెట్ వెంటనే కన్ఫామ్ కావాలి అంటే ఈ టిక్స్ పాటించాల్సిందే.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. పండగల సీజను ఇతరత్రా బిజీ సమయంలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసిన కానీ చాలామందికి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది.
Advertisement
ఆ సమయంలో అదృష్టం ఉంటేనే కన్ఫామ్ అవుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించడం కోసం భారత రైల్వే కొత్త పరిష్కారాన్ని చూపిస్తోంది. అదే ఐఆర్సిటిసి వికల్ప్ స్కీం. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు బెర్త్ కన్ఫామ్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. దీన్నే ఆల్టర్నేటివ్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ అని కూడా అంటారు. మనం ప్రయాణించే రైలులో బెర్త్ లు ఖాళీ లేనప్పుడు వెయిటింగ్ లిస్టులో టికెట్ తీసుకుంటాం.
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 23.03. 2023
ఉదాహరణకు మనం స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే, అందులో కాళీ లేకపోతే ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్లీపర్ కంటే పై క్లాసులో వ్యక్తులు ఖాళీగా ఉంటే అందులో ప్రయాణం చేయొచ్చు. థర్డ్ క్లాస్ ఏ సి, సెకండ్ క్లాస్ ఏ సి, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిల్లో బెర్త్ లు ఖాళీగా ఉంటే ప్రయాణం చేసే వీలుంటుంది. దీనికి టికెట్ బుక్ చేసుకునే ముందు ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఖాళీ బెర్త్ లతో రైలు వృధాగా పోవడం ఎందుకని, ఆ బెర్తుల్లో ఇలా టికెట్ కన్ఫామ్ అవ్వని వారికోసం ఉపయోగపడేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.
also read:ఆస్ట్రేలియా వెళ్లిన భర్త..బెడ్ రూంలో భార్య ఎంత పని చేసిందంటే..?