Advertisement
సాధారణంగా మనం ఏ కూర చేసినా వాటిలో టమోటాను తప్పకుండా వాడుతుంటాం. ప్రస్తుతం ఆ టమోటా ప్రజలు కొనసాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రైతన్నకు మాత్రం సిరులు కురిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలకు టమోటా తోటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. దీంతో మార్కెట్ లో టమాటాలకు గిరాకీ పెరగడంతో పాటు ధర కూడా ఝలక్ ఇస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా టమాట రైతులకు జాక్ పాట్ తగిలినట్టయింది.
Advertisement
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళి అనే రైతు గత 45 రోజుల్లో రూ.4కోట్ల ఆదాయాన్ని సంపాదించారు. మురళీ తండ్రి కూడా ఓ రైతే.. వీరు టమోటాల సాగుతో రూ.50వేలకు ఓ ఇల్లు కొనుక్కున్నారు. మరికొంత మొత్తం దేవుడి హుండీలో వేశారు. టమాట సాగుతో మురళి విజయం సాధించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. నష్టాలతో కూడా సావాసం చేసాడు. గరిష్ట దిగుబడి వచ్చేసరికి మార్కెట్ లో టమాటాలకు ధర లేక గత ఏడాది ఆయన కుటుంబానికి రూ.1.5 కోట్ల అప్పు మిగిలింది. సకాలంలో విద్యుత్ సరఫరా కావడం.. నాణ్యతతో కూడిన పంట దిగుబడి.. సరసమైన ధర పలకడంతో మురళీ కుటుంబం రూపురేఖలే మారిపోయాయి.
Advertisement
ఇంతకు ముందు ఏపీ ఎంసీ మార్కెట్ యార్డులో కంటే మెరుగైన ధరకు విక్రయించడం కోసం దాదాపు 130 కి.మీ. దూరంలోని కోలార్ కి వెళ్లి టమాటాలు విక్రయించేవాడు. ఏడాది చాలా కష్టపడి ప్రణాళికబద్ధంగా పంట సాగు చేయడంతో గత ఏడాది అప్పు తీర్చడంతో పాట కేవలం 45 రోజుల్లో 4 కోట్ల ఆదాయాన్ని సంపాదించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఈ ఏడాది అధునాతన టెక్నాలజీ, హార్టికల్చర్ పద్దతులతో భారీ మొత్తంలో పంట సాగు చేయాలని సంకల్పించాడు. అందుకోసం అదనంగా 20 ఎకరాల భూమి కొనుగోలు చేయాలని భావిస్తున్నాడు.