Advertisement
చెన్నైకి చెందిన గణేష్ మురుగన్ వయసు 37 సంవత్సరాలు. అతను జొమాటోలో ఫుడ్ డెలివరీ చేస్తూ కాలం గడిపేవాడు. అయితే ఒకసారి ట్రక్కు ఢీకొని అతని వెన్నుముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో కింది భాగం మొత్తం పని చేయకుండా పోయింది. అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేక పోయాడు. ఇది 6 ఏళ్ల కిందట జరిగింది.
Advertisement
Also Read: అతి చిన్న వయసులోనే జీవిత భాగస్వాముల్ని కోల్పోయిన 9టాలీవుడ్ జంటలు !
అయితే అంతటి ప్రమాదం బారిన పడి నడవరాకుండా అయిపోయిన, అతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కష్టపడి పని చేసేందుకు నడుం బిగించాడు. అందులో భాగంగానే ఐఐటి మద్రాస్ వారి సహకారంతో ఒక వీల్ చైర్ ను తీసుకొని దాంతో ఫుడ్ డెలివరీలు చేయడం మొదలుపెట్టాడు. ఆ వీల్ చైర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లా పనిచేస్తుంది. అందులో బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల పాటు చార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు వెళ్లవచ్చు.
Also Read: Pakka Commercial Review: పక్కా కమర్షియల్ రివ్యూ
Advertisement
ఇలా గణేష్ తాను వైకల్యం బారిన పడ్డాననే బాధ లేకుండా తన కాళ్ళపై తాను నిలబడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలామంది నచ్చిన పని దొరకడం లేదని సమయాన్ని, వయస్సును వృధా చేసుకుంటున్నారు. అలాగే కొందరు జల్సాలు చేస్తూ తిరుగుతుంటారు. అలాంటి వారందరికీ గణేష్ ప్రేరణగా నిలుస్తున్నాడు. కష్టపడి పని చేయాలని తపన ఉండాలే కానీ ఏ పని అయినా చేయవచ్చని, అందుకు శరీర వైకల్యం కూడా అడ్డు కాదని అతను నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని స్టోరీ తెలిసిన వారు కన్నీళ్లు పెడుతున్నారు. అతన్ని అభినందిస్తున్నారు. అతన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే అతని స్టోరీ వైరల్ అవుతుంది.