Advertisement
ప్రేమ గొప్పతనం త్యాగంలో కనిపిస్తుంది. దూరమైన కొద్ది ప్రేమ పెరుగుతుంది అంటారు. ఇది ఎంత నిజమో తెలియదు కానీ, నీతో ఎంత సమీపంగా ఉంటే అంతగా ప్రేమ పెరుగుతుందని చెబుతారు. ఇక ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువ అయిపోయాయి. స్కూల్ సమయంలోనే ప్రేమించుకుని, లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. అయితే, ఇందులో కొన్ని జంటలు సక్సెస్ అవుతే, కొన్ని మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.
Advertisement
ఇక కొంతమంది ప్రేమను లైట్ తీసుకుంటుంటే, కొంతమంది ప్రాణాలకు తెగిస్తున్నారు. అయితే, అస్సోంలో ఓ అరుదైన ప్రేమికుడు ఉన్నాడు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్న యువతి అర్ధాంతరంగా చనిపోవడం వల్ల ఆ ప్రియుడు తట్టుకోలేకపోయాడు. మృతదేహం వద్ద రోదించి, చివరకు ఆమెకు తాళి కట్టాడు. ఆమె కుటుంబ సభ్యుల ముందే మృతదేహాన్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రేయసి నుదుటిపై కుంకుమ పెట్టి, దండ వేశాడు. ఇక జీవితంలో ఎవరిని వివాహం చేసుకోనని, ఒంటరిగానే ఉంటానని శపథం చేశాడు.
Advertisement
అస్సాంలోని మోరీగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథన బోరా ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథమిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం తెలుసుకుని ఆమె ఇంటికి చేరుకున్న బిటుపాన్ కన్నీరు మున్నిరుగా విలపించాడు. జీవితాంతం కలిసి నడవాలనుకున్న తన ప్రేయసి ఇలా మిగతా జీవిలా మారడాన్ని తట్టుకోలేకపోయాడు. చివరికి మృతదేహానికే తాళి కట్టాలని నిర్ణయించుకున్నాడు. జీవితాంతం ఒంటరిగా ఉంటానని మరో పెళ్లి చేసుకోనని శపథం చేశారు. ప్రేమ పేరుతో వంచిస్తున్న యువతి యువకుల సంఘటనలు నిత్యం వెలుగు చూస్తుండగా, బిటుపాన్ చేసిన పనికి స్థానికులతో పాటు నటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రేమికులు కూడా ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.