Advertisement
ప్రస్తుతం ఈ మధ్య కాలంలో మహిళలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా తమ సుఖం కోసం కట్టుకున్న భర్తను కూడా వదిలించుకుంటున్నారు కొంతమంది. మరికొందరూ అత్తలతో పొట్లాడి వారిని తిరిగి రాని లోకాలకు పంపిస్తున్నారు. కొంత మంది వారికి వారే ఇబ్బందులను ఎదుర్కొని చేసేది ఏమి లేక ఆత్మ*త్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటుండటం గమనార్హం. తాజాగా జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. మెదక్ జిల్లా తూఫ్రాన్ కాళ్లకల్ ప్రాంతంలో చెనిగారపు స్వాతి (30) వివాహిత. ఈమెకు ఓ కూతురు, కుమారుడు కలరు. అయితే స్వాతి గత కొంత కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు సమాచారం. రాను రాను ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతుండటంతో తట్టుకోలేకపోయింది స్వాతి.
Advertisement
దీంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. చేసేది ఏమి లేక స్వాతి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లారు. స్వాతి మరణించడంతో ఆమె కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా చావు అనేది పరిష్కారం కాదనేది గుర్తుంచుకోవడం చాలా ఉత్తమం.
మరికొన్ని ముఖ్య వార్తలు :