Advertisement
ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరి కొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ప్రపోజల్ చేసే ధైర్యం లేక చాలా ప్రేమలో ఆదిలోనే అంతమవుతాయి. కొంతమంది అయితే వాలంటైన్స్ డే కోసం పడిగాపులు కాస్తుంటారు.
Advertisement
ఆరోజు తమ ప్రేమను వ్యక్తం చేయాలని భావిస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ ప్రపోజల్స్ లో భిన్నమైన పద్ధతులు వచ్చాయి. గ్రీటింగ్ కార్డ్స్, గులాబీలు ఇవ్వడమే కాదు. చాక్లెట్స్, చీరలు, గోల్డ్ రింగ్స్ వంటి కాస్ట్లీ బహుమతుల రూపంలో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. కానీ ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి రిస్క్ తో కూడిన ప్రపోజల్ చేశాడు. భిన్నంగా తన ప్రేయసికి ప్రపోజల్ చేయాలనుకున్నాడేమో, ఓ రోడ్డుపై బైకుమీద స్టంట్ చేస్తూ తన ప్రేమను ఆమె ముందు ఉంచాడు. బైక్ పై ఆమె ముందు కూర్చోగా గులాబీ అందించాడు.
Advertisement
దీన్ని తీసుకున్న యువతీ పాజిటివ్ గా స్పందించినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను బ్లాక్ హాట్ బాయ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ రూపంలో పంచుకున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ వీరిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించాడు. అతడు ప్రశ్నించడం ఏమో కానీ ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అది నిజమైన స్టంటా, లేదా వీడియో క్రియేట్ కోసం చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూస్తుంటే ప్రేమ ప్రపోజల్ కూడా హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తుంది కదా !
इन पर भी कोई कार्रवाई होगी क्या…#Trending #TrendingNews pic.twitter.com/Gdq4fTLlsa
— Narendra Singh (@NarendraNeer007) January 24, 2023
READ ALSO : పూర్వం ఉదయం నిద్ర లేవడానికి ఎటువంటి అలారం వాడేవారు ? ఇది అస్సలు నమ్మలేరు ..!