Advertisement
Aa Ammayi Gurinchi Meeku Cheppali Review and Rating: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి వహిస్తున్నారు. మహేంద్ర బాబు బి, కిరణ్ బల్లపల్లి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. అయితే.. ఈ సినిమా థియేటర్లలో ఇవాళ రిలీజ్ అయింది. ఇక సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Aa Ammayi Gurinchi Meeku Cheppali Review and Rating కథ & విశ్లేషణ:
ఐదు సూపర్ హిట్ సినిమాలను వెంటవెంటనే ఇచ్చిన డైరెక్టర్ నవీన్ (సుధీర్ బాబు) ఈసారి కాస్త భిన్నమైన సినిమా చేయాలని భావిస్తూ ఉంటాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేయడమే కాదు తనకంటూ పేరు తెచ్చుకునే విధంగా భిన్నమైన సబ్జెక్టు చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో రోడ్డు మీద వెళుతున్న క్రమంలో ఒక పాడైన సినిమా రోల్ రీల్ దొరుకుతుంది. డిజిటల్ యుగంలో కూడా రీల్స్ వాడుతున్నారా అని అనుమానం వచ్చి ఆ రీల్ తనకు తెలిసిన ల్యాబ్ లో కడిగిస్తాడు. ఆ సమయంలో ఆ రీల్ లో నటించిన అమ్మాయిని చూసి మేస్మరైజ్ అవుతాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి) అని తెలుసుకుంటాడు.
Advertisement
ఆమెను ఎలా అయినా తన సినిమాలో నటింపజేయాలని ఆమె వెన కాపాడుతూ ఉంటాడు. ఇలా ఆమె వెంట పడుతున్న సమయంలో అనూహ్యమైన ఒక విషయం తెలుస్తుంది. ఆ రీల్ లో ఉన్నది అలేఖ్య కాదని, అలేఖ్య సోదరి అని తెలుస్తుంది. సినిమా నటి అవ్వాలని కోరికతో ఒక అప్ కమింగ్ దర్శకుడిని వివాహం చేసుకొని ఆ దర్శకుడు చేసే సినిమా ఆగిపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడంతో అలేఖ్య ఆ కుటుంబం అంతా సినిమా మీద అసహ్యం పెంచుకుంటారు. అలాంటి తరుణంలో అలేఖ్య, నవీన్ సినిమాలో నటించిందా? అసలు ఈ కథకు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ ఎందుకు వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించారు. ఒకరకంగా సినిమా మొత్తం మీద కృతి శెట్టితో డామినేట్ చేసి నటించగల రోల్ ఆయనకు దక్కింది. కృతి శెట్టి కూడా సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో మెరిసింది. ఆమె రెండు పాత్రలకు న్యాయం చేసిందని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కృతి శెట్టి. రొమాన్స్, కామెడీ, సుధీర్ బాబు యాక్టింగ్, పాటలు
మైనస్ పాయింట్స్:
సినిమాలో కొన్ని సీన్స్ అవసరమా అన్నట్టుగా ఉంటాయి. వాటిని ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.
రేటింగ్: 3/5
READ ALSO : బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా ?