Advertisement
ఇండియాలో చాలామంది ప్రభుత్వ శాఖల్లో పని చేస్తే సిబ్బంది ప్రజల నుంచి లంచాలను తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తారు. దీంతో అధికారులు చాలా చాకచక్యంగా లంచం చూసుకునే సమయంలో దాడులు చేసి వారిని పట్టుకుంటారు. ఈ విధంగా లంచం తీసుకునే అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకోవడం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఏసీబీ అధికారులు లంచగొండి అధికారులను పట్టుకున్న తర్వాత వారిని మీడియా ముందు ప్రవేశ పెడుతూ వారు తీసుకున్న కరెన్సీ నోట్లతో, పాటు పింక్ కలర్లో నోట్లతో పాటు ఈ కలర్ ఉండే సీసాలను చూపిస్తూ ఉంటారు. అసలు సీసాలు ఎందుకు వాడుతారు.. అందులో పింక్ కలర్ ద్రావణం ఎందుకు పోస్తారు..
Advertisement
also read; కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే..జరుగబోయేవి ఇవే !
Advertisement
దానికి లంచానికి సంబంధం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని ఉద్యోగులకు లంచంగా ఇవ్వమంటారు. ఈ క్రమంలోనే అధికారులు నోట్లకు పినాప్తలిన్ అనే పౌడర్ ను రాస్తారు. ఈ పౌడర్ మన కళ్ళకు కనిపించదు. ఈ సందర్భంలోనే బాధితులు ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ వారు దాడి చేసి ఆ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం వారి వద్ద ఉన్న లంచం ఇచ్చిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వాధికారుల చేతులను ఒక ప్రత్యేకమైన మిశ్రమంలో ముంచుతారు. దాన్ని సోడియం బై కార్బోనేట్ మిశ్రమంగా పిలుస్తారు.
అయితే ప్రభుత్వ అధికారులు కనుక లంచం తీసుకుంటే ఆ కరెన్సీ నోట్లను ముట్టుకుంటారు కదా, అలాంటి సమయంలో ఆ నోట్ల కుండే పినప్తలీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఈ క్రమంలో వారు సోడియం మిశ్రమంలో చేతులు ముంచగానే ఆ మిశ్రమం కాస్త పింకు రంగులోకి మారుతుంది.. అంటే వారు లంచం తీసుకున్నారని చెప్పేందుకు పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే సాక్ష్యం అన్నమాట. ఈ క్రమంలో పింక్ కలర్ లోకి మారిన మిశ్రమాన్ని కూడా మీడియాకు చూపిస్తారు. దీన్నిబట్టి ప్రభుత్వ అధికారులు లంచం తీసుకున్నారని మనకు అర్థం అవుతుంది. అందుకే ఇలాంటి కేసుల్లో కరెన్సీ నోట్లతో పాటు పింక్ కలర్ మిశ్రమం కలిసిన సీసాలు కనిపిస్తూ ఉంటాయి.
also read: