Advertisement
మల్టీ స్టార్ అంటేనే ప్రేక్షకుడు ఎన్నో అంచనాలతో థియేటర్ కు వెళ్తాడు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ఒకే సినిమాలో ఉన్నారంటే హైపు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు, చరణ్ నటించిన తాజా చిత్రం ఆచార్య. అయితే, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
మొత్తం రూ. 130 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ జరగగా చిత్రం విడుదలయ్యాక వచ్చిన షేర్ కేవలం రూ. 45 కోట్లు మాత్రమే. దీనితో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయామని లబోదిబోమంటున్నారు. అయితే వాస్తవానికి ఆశ్చర్య ఒరిజినల్ స్టోరీ వేరే ఉందని సమాచారం. ఇందులో చిరంజీవి నక్సలైట్ గా కాకుండా ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాల్సి ఉందట.
Advertisement
acharya movie story
ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారిగా ఆయన ధర్మస్థలిని ఎలా కాపాడుతారు. అని కొరటాల లైన్ రాసుకున్నారట. ఇక చరణ్ ను కూడా ఇందులో చూపించాలని అనుకున్నారట. కానీ అసలు ఏం జరిగిందో తెలియదు. కథను పూర్తిగా మార్చేశారు. చరణ్ పాత్రను బలవంతంగా జోడించినట్లు చేశారు. అలాగే చిరంజీవి పాత్రను నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో మార్చేశారు. ఇక కాజల్ అగర్వాల్ పాత్రను తీసేశారు. కథలో చివరి నిమిషం వరకు ఇలా అనేక మార్పులు చేయడం వల్లే ఆచార్య ఫ్లాప్ అయిందని అంటున్నారు. ముందుగా అనుకున్న స్టోరీ తోనే మూవీ ని తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు.
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?