Advertisement
నటుడు బెనర్జీ గురించి ప్రత్సేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుకోకుండా సినిమాల్లోకి అరంగేట్రం, ఆపై నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం, ముక్కుసూటి మనస్తత్వం, నటుడిగా ఎత్తు పల్లాలు చూసిన ఏనాడు వెనుదిరిగి చూడని నటుడు బెనర్జీ. నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నారు. విలన్ గానే కాదు, ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోయే నటుడాయన.
Advertisement
మా అసోసియేషన్ ఎన్నికల్లోను, నటుడు బెనర్జీ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే, నటుడు బెనర్జీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు నటుడు బెనర్జీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకుందాం. నటుడు బెనర్జీ తండ్రి ఎవరో కాదు నటుడు రాఘవయ్య. నటుడు రాఘవయ్య 50 ఏళ్లు సినిమా పరిశ్రమలో కొనసాగారు. ఇక తన తండ్రి ఇచ్చిన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడు బెనర్జీ ఎదిగిన వైనం మనందరం చూసాము. చాలామంది నటన అంటే ఎక్స్ప్రెషన్స్ తో పాటు గట్టిగా అరిచే డైలాగులు చెప్పి, అందరి అటెన్షన్ సంపాదించడం అని అందరూ అనుకుంటారు.
Advertisement
కానీ వీరందరికీ బెనర్జీ పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. ఇక బెనర్జీ కెరీర్ లో విరాటపర్వం ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు. 1982లో హరిశ్చంద్రుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 150 సినిమాల వరకు నటించాడు. ఇక విజయవాడలో పుట్టిన బెనర్జీ మాంటేస్సారి లో చదువుకున్నాడు. అతడి తండ్రి రాఘవయ్య ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో పనిచేయడం వల్ల ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత చెన్నైకి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. మొదట్లో విజయనగరంలో ఒక కంపెనీకి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేశాడు. ఇక బెనర్జీకి భార్య మరియు కూతురు ఉన్నారు.
READ ALSO : పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమాను కొన్న కొడాలి నాని.. అదేంటో తెలుసా ?