Advertisement
సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోలకు, హీరోయిన్స్ కు డూప్స్ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే.. చాలా మంది కొన్ని సన్నివేశాలలో నటించడానికి అస్సలు ఇష్టపడరు. అటువంటి సందర్భాలలో డైరెక్టర్స్ డూప్ సాయం తీసుకుంటూ ఉంటారు. అలా సీనియర్ నటి శ్రీదేవికి ఆర్టిస్ట్ హేమ ఓ సినిమాలో డూప్ గా నటించారు. హేమ ప్రస్తుతం సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
దివంగత నటి శ్రీదేవి తెలుగు హీరోయిన్ గా చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈమె తెలుగులోనే కాకుండా, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు భోజ్ పురి చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆమె అకాల మరణం అందరిని విషాదంలో ముంచేసింది. నటనాపరంగా శ్రీదేవి ఎప్పుడో తన ప్రతిభని చాటుకున్నారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన శ్రీదేవి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలకు మాత్రం డూప్ సాయాన్ని తీసుకునేవారట.
Advertisement
అలా.. శ్రీదేవి, చిరంజీవి హీరో, హీరోయిన్స్ గా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవి నటించాల్సిన ఓ సన్నివేశంలో ఆమె డూప్ గా నటి హేమ నటించారట. ఈ సినిమాలో శ్రీదేవి దేవకన్యగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం శ్రీదేవి నీటిలో స్విమ్మింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అయితే శ్రీదేవికి ఈత రాదు. అందుకే తాను ఈ సన్నివేశంలో నటించలేను అంటూ ముందే చెప్పేశారట. దీనితో దర్శకుడు చేసేది లేక అటు ఇటుగా కొంచం శ్రీదేవి ఒడ్డు పొడవు ఉన్న నటి హేమతో ఆ స్విమ్మింగ్ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ప్రస్తుతం నటి హేమ వరుస సినిమాల్లో అక్క, పిన్ని, వదిన వంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని..
మా సినిమాని మాకే వదిలావా అంటూ “లియో” సినిమా డైరెక్టర్ లోకేష్ ని ఆడుకుంటున్న నెటిజన్స్..!
Bhagavanth Kesari: “బాలయ్య” సినిమాలో ఆ వ్యాపార వేత్తని ఎందుకు టార్గెట్ చేసారు ???
సుప్రీం తీర్పు ఎలా ఉన్నా జనంలోకి రానున్న టీడీపీ.. పక్క ప్లాన్ సిద్ధం..?