Advertisement
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతలా అభిమానులు ఉన్నారో మనందరికీ తెలుసు. అందరి హీరోలకు ఉన్న అభిమానులు వేరు, పవన్ ఫ్యాన్స్ వేరు. పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు క్రియాశీలక రాజకీయాల్లో కూడా ముందుంటున్నారు. ఈ మధ్యకాలంలోనే హరీష్ శంకర్, సుజిత్ చిత్రాలకు పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించాడు. హరిష్ శంకర్ తో చేయబోయే ‘తేరి’ రీమేక్ అని తెలుసు. ఇక సుజిత్ డైరెక్షన్లో చేయబోయేది ‘ఓజీ’ అనే గ్యాంగ్ స్టార్ డ్రామా కథ కావడం విశేషం. అయితే తాజాగా లయ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆయన నా పెళ్ళికి వచ్చారని అన్నది.
Advertisement
2006లో డాక్టర్ శ్రీ గణేష్ ను లయ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వివాహానికి చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ను పిలుద్దామని వెళ్లారట. కానీ వారి అపాయింట్మెంట్ లేదు. కానీ అక్కడికి లైయ వెళ్లిందట. దీంతో విషయం తెలుసుకున్న వారు వెంటనే రమ్మన్నారు. చాలాసేపు మాట్లాడారట. ఆమె ఇచ్చిన ఇన్విటేషన్ తీసుకున్నారట. తప్పకుండా వస్తామని చెప్పారని లయ తెలియజేసింది. నిజానికి వారు మ్యారేజ్ కి రారు అనుకున్న, కానీ అందరికంటే ముందే పవన్ కళ్యాణ్ వచ్చారు. అది కూడా ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా, కనీసం వస్తున్నానని సమాచారం కూడా ఇవ్వకుండా వచ్చారని లేదా తెలియజేసింది.
Advertisement
ఆయనను బాగా రిసీవ్ చేసుకుని ఏర్పాట్లు చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని, సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారని అన్నారు. అన్నయ్యని పిలిచావు కాదమ్మా అన్నయ్య కూడా వస్తున్నారు.. ఆన్ ద వేలో ఉన్నారు అని పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నారని ఆమె గుర్తు చేసుకుంది. “థాంక్యూ సో మచ్ సార్” భోజనం చేసి వెళ్ళండి అని లయ అనగానే నవ్వుకుంటూ భోజనం చేయాలా అమ్మ తర్వాత చూద్దామంటూ నవ్వుకొని వెళ్లిపోయారని అన్నది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చిన మాట ప్రకారం నా పెళ్ళికి అటెండ్ అయ్యారని లయ తెలియజేసింది.
also read: