Advertisement
Comedian Sunil Wife and Family: కమెడియన్స్ కథ అని తక్కువ అంచనా వేశారో పప్పులో కాలు వేసినట్టే, ఎందుకనగా మన దగ్గర కొందరు కమెడియన్లు హీరోలతో సమానంగా సంపాదిస్తున్నారు. రోజుకు ఇంత అంటూ కాల్సిట్ ప్రకారం, ముక్కు పిండి హీరోలతో సమానంగా సంపాదిస్తుంటారు. ఏడాది పాటు కలిసి ఒక్కో సినిమాలో హీరో నటిస్తే కానీ కమెడియన్స్ మాత్రం ఏడాదంతా నటిస్తూనే ఉంటారు. కమెడియన్ అనగానే వారి జీవితం కాస్త విభిన్నంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అందులో చాలా వరకు కమెడీయన్స్ సింపుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇందులో మొదటి వరుసలో కమెడియన్ సునీల్ ఉంటారు. ఇండస్ట్రీలో కమెడియన్ సునీల్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. కమెడియన్ నుంచి మొదలుపెట్టి, హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు సునీల్.
Advertisement
విలన్ అవుదామని వచ్చి కమెడియన్ గా టాప్ లెవెల్ కు వెళ్లిపోయాడు. నువ్వే కావాలి సినిమాతో పరిచయమైన సునీల్ నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయ్యాడు. అప్పట్లో ఏడాదికి దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు. సినిమాల్లోకి రాకముందు భీమవరం లోనే ఉండేవాడు సునీల్. స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చాడు స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నాడు. సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈయన భార్య గురించి కానీ, కుటుంబం గురించి కానీ చాలామందికి ఐడియా లేదు. కేవలం ఐదు సంవత్సరాల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు సునీల్.
Advertisement
అప్పటి నుంచి అమ్మ లాలనలోనే పెరిగాడు సునీల్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇది కూడా చాలామందికి తెలియని నిజం. సునీల్ అర్ధాంగి పేరు శృతి ఇందుకూరి. ఈమె ఫోటోలు కూడా బయట ఎక్కువగా కనిపించవు. పైగా తన కుటుంబాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంటాడు సునీల్. తెలిసిన కుటుంబం నుంచి తన భార్యను తెచ్చుకున్నాడు సునీల్. ఈయనది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిరిచిన పెళ్లి. 45 ఏళ్ల సునీల్ కు ఒక పాప, బాబు ఉన్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ బయట పెద్దగా కనిపించదు. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కమెడియన్ గా నటిస్తూనే, హరీష్ శంకర్ కథ అందిస్తున్న వేదాంతం రాఘవయ్యలో హీరోగా నటిస్తున్నాడు.
READ ALSO : వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్లగలిగే దేశాలు ఇవే!