Advertisement
నందమూరి తారక రామారావు పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరు. ఎన్నో పాత్రలను ఎంతో అద్భుతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. దానవీర సూరకర్ణ సినిమా మొదలు పెట్టే సమయానికి ఎన్టీ రామారావు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోగా తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఆ రోజుల్లో పలువురిని ఇది ఆశ్చర్యానికి గురి చేసింది. 1977లో స్వీయ నిర్మాణ దర్శకత్వంలో దానవీరశూరకర్ణ చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్ నిర్మాణ దర్శక బాధ్యతలతో పాటుగా కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు ఇలా మూడు పాత్రలో ఆయన నటించారనే దాని కంటే జీవించారని చెప్పొచ్చు.
Advertisement
ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి అంటూ ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్టీ రామారావు కృషి శ్రమ ఫలితంగా ఇంత గొప్ప పేరు వచ్చింది. ఎన్టీఆర్ మహాభారతంలోని కొంత భాగాన్ని తీసుకుని ఒక పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నారు ఆ మూవీకి సంభాషణల రచయితగా గుంటూరులోని ఓ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయిన కొండవీటి వెంకట కవిని తీసుకున్నారు. ఈ కవికి ఇదే మొదటి చిత్రం. కానీ ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Advertisement
Also read:
ధర్మరాజుగా ప్రభాకర్ రెడ్డి, అర్జునుడిగా హరికృష్ణ, భీముడుగా సత్యనారాయణ, అభిమన్యుడిగా బాలకృష్ణ నటించారు. మూడు పాత్రలో ఎన్టీఆర్ కనిపించగా ఇంద్రుడు, జరాసంధుడు, అతిరథుడు, రెండు అతిధి పాత్రలో మొత్తం ఐదు పాత్రలో చలపతి రావు కనపడ్డారు. ఈ భారీ చిత్రాన్ని 43 రోజుల్లో షూటింగ్ చేసేసారు ఈ సినిమా నాలుగు గంటల 17 నిమిషాలు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం సినిమానికి సినిమాకి ప్రాణం పోసింది ఆ రోజుల్లో ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది ఇప్పటికే కూడా చాలామంది సినిమాని చూడడానికి ఇష్టపడతారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!