Advertisement
కన్నడ మూవీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ దర్శన్ హీరోయిన్ పవిత్ర గౌడ అరెస్టు సంచలనం రేపింది. ప్రియురాలు పవిత్ర గౌడ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రేణుక స్వామి అనే యువకుడ్ని చావు కొట్టిన ఆరోపణలు వస్తున్న కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేశారు విచారణ నిమిత్తం ఆరు రోజులు పోలీస్ కస్టడీకి తరలించారు. సినీ ఇండస్ట్రీలో ఇలా హత్యయత్నం నేరాల్లో ఇరుక్కున్న హీరోలు నటుల గురించి చూద్దాం.
Advertisement
ఎం ఆర్ రాధా:
రాధికా శరత్ కుమార్ తండ్రి సూపర్ స్టార్ ఎం.జి రామచంద్ర పై విలన్ పాత్రలు పోషించే ఎం ఆర్ రాధా కాల్పుల ఘటనలు సంచలనం రేపింది. ఎంజిఆర్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడం తీవ్రంగా గాయపడ్డాం జరిగింది. ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది తర్వాత ఎమ్మార్ రాధను క్షమించడంతో వాళ్ళిద్దరూ కలిసి నటించారు.
ఎం కె త్యాగరాజు భగవతార్:
తమిళ్ నటుడు ఎం కె త్యాగరాజు భగవతార్ కూడా మర్డర్ కేసులో శిక్ష అనుభవించారు 1944లో లక్ష్మీకాంతం అనే వ్యక్తి హత్య కేసులో ముద్దాయిగా నిలిచారు మూడేళ్లు జైల్లో ఉండి వచ్చారు.
సుమన్:
సీనియర్ నటుడు సుమన్ కూడా తమిళంలో గుండా యాక్ట్ కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. చాలా కాలం జైలులో ఉన్నారు. జైలు నుండి వచ్చాక మళ్ళీ కెరీర్ ని స్టార్ట్ చేసి నటుడుగా కొనసాగించారు.
Advertisement
నవజ్యోత్ సింగ్:
క్రికెటర్ రియాలిటీ షోలో రాణించిన నవజ్యోత్ సింగ్ కూడా హత్య కేసులో ఇరుక్కున్నారు ఓ అభిమాని తనతో దురుసుగా ప్రవర్తించడంతో చెయ్యి చేసుకున్నారు ఆ సంఘటనలో ఆ వ్యక్తి అనూహ్యంగా మరణించారు. 1988 లో ఇది చోటుచేసుకుంది మూడేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు.
Also read:
దిలీప్:
మలయాళం లో స్టార్ హీరోగా ఉన్న దిలీప్ కూడా హీరోయిన్ పై లైంగిక దాడి చేసి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాత జైలు శిక్ష అనుభవించారు. సినీ కెరియర్లో నిలదొక్కుకోలేకపోయారు.
బాలకృష్ణ:
నందమూరి బాలకృష్ణ కూడా హత్యాయత్నం కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది నిర్మాత బెల్లంకొండ సురేష్ జ్యోతిష్యుడు పై కాల్పులు జరిపిన ఘటనలో ఆయన కేసు నమోదు అయింది. ఎలాంటి శిక్ష పడకుండా ఈ కేసు నుండి బయట పడటంతో ఏ నష్టం కూడా జరగలేదు. ఇక ఇప్పుడు మర్డర్ కేసులో దర్శన్ జైలుకు వెళ్ళాడు. అలాగే తాజాగా హేమ కూడా రేవ్ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!