Advertisement
చాలామంది పెద్ద నటులు అవ్వాలని ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. కానీ అనుకున్నంత మాత్రాన అందరూ సక్సెస్ కాలేరు. కొంతమంది మధ్యలోనే సినిమాలని వదిలి వెళ్ళిపోతుంటారు. ఇదిలా ఉంటే కొంతమంది నటులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆరోగ్యం బాలేకపోవడం చెడు అలవాట్లు ప్రమాదాలు ఇలా పలు కారణాల వలన కొంతమంది యుక్తవయసులోనే తుది శ్వాస విడిచారు అలా మనం కోల్పోయిన నటుల వివరాలను చూద్దాం.
Advertisement
సావిత్రి (1936 – 1981):
మహానటి సావిత్రి గురించి కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. కోమాలో ఏడాది పాటు ఉన్న ఉంటూ ఒకరోజు ఈ లోకాన్నే వదిలెళ్ళిపోయారు.
కునాల్ (1977–2008):
ముప్పై ఏళ్లకే చనిపోయారు. కునాల్ ప్రేమికుల రోజు సినిమాతో దగ్గర అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వలన సూ$$ చేసుకున్నారు.
భార్గవి (1983–2008):
భార్గవి కూడా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అష్టా చెమ్మా సినిమాలో నానికి చెల్లెలిగా చేసింది. ఇంట్లో వాళ్ళు ప్రియుడు తో పెళ్ళికి ఒప్పుకోలేదు. అందుకే ఆమె సూ$$ చేసుకున్నారు.
యశో సాగర్:
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో అందరికీ పరిచయం అయ్యారు. కారు ప్రమాదం వలన ప్రాణాలని కోల్పోయారు.
విజయ్ సాయి:
నలభై రాకుండానే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. సమస్యల కారణంగా సూ$$ చేసుకున్నారు.
సౌందర్య (1972–2004):
Advertisement
ఈమె కూడా చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. 31 సంవత్సరాలు కి సౌందర్య ప్రాణాలని కోల్పోయారు. ఒక రాజకీయ పార్టీకి తన వంతు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆమె వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదం వలన మరణించారు.
ఉదయ్ కిరణ్ (1980–2014):
ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిప్రెషన్ కి వెళ్ళిపోయి ఉదయ్ కిరణ్ సూ$$ చేసుకున్నారు. ఇప్పటికి కూడా ఆయన గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్:
34 సంవత్సరాలు కి ఈయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
సిల్క్ స్మిత (1960–1996) :
సిల్క్ స్మిత తెలీని వాళ్ళు వుండరు. 35 సంవత్సరాలుకే ఈమె ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది.
ప్రత్యూష (1981–2002):
వ్యక్తిగత సమస్యల వలన ఈమె ఆత్మ$$ చేసుకున్నారు. కానీ మరి అసలు ఈమెకి ఏం అయిందో క్లియర్ గా తెలీదు.
ఆర్తి అగర్వాల్ (1984–2015):
31 ఏళ్లకే ఆర్తి అగర్వాల్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. లైపోసెక్షన్ ఆపరేషన్ జరిగినప్పుడు అనారోగ్య సమస్యల వలన ఆమె చనిపోయింది.
దివ్యభారతి (1974–1993):
19 సంవత్సరాలుకె దివ్యభారతి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
Also read: