Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. అతని అసాధారణమైన దర్శకత్వ నైపుణ్యాలతో ఆయన పాన్-ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆయన చివరగా దర్శకత్వం వహించిన RRR అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలలో మూడవది. అయినప్పటికీ, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా కొన్ని రిజెక్షన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 12 మంది నటులు ఆయన సినిమాల్లో నటించడానికి ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
వివేక్ ఒబెరాయ్
నెగిటివ్ పాత్రలు పోషించడంలో పేరుగాంచిన వివేక్ ఒబెరాయ్ కు బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి పాత్రని ఆఫర్ చేసారు. కానీ అప్పటికే చాలా సినిమాలు ఒప్పుకుని ఉండడం, డేట్స్ కుదరకపోవడంతో వివేక్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసారు. ఆ ప్లేస్ లో రానా ఆ పాత్రకి న్యాయం చేసారు.
హృతిక్ రోషన్
సినిమా ప్రారంభ దశలో, బాహుబలిలో హృతిక్ రోషన్‌ను నటింపజేయాలని ఎస్ఎస్ రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేయాలని గతంలోనే అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి అధికారికంగా కమిట్ అయ్యే ముందు మొత్తం కథాంశాన్ని బయటపెట్టకుండా రాజమౌళి మొండిగా ఉన్నాడు. అందుకే హృతిక్ ఈ సినిమాను రిజెక్ట్ చేసి మొహంజొదారో సినిమాకు ఒప్పుకున్నాడు.
జాన్ అబ్రహం:
భల్లాల దేవ పాత్ర కోసం ఈయనని కూడా రాజమౌళి సంప్రదించాడు. కానీ, ఈయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆ పాత్రకి రాణాని ఎంచుకున్నారు.
బాలకృష్ణ:
మగధీర సినిమాలో లీడ్ రోల్ కోసం మొదట బాలక్రిష్ణని అనుకున్నారట రాజమౌళి. కానీ, బాలకృష్ణ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో రామ్ చరణ్ తో ఈ సినిమా చేసారు.
అమితాబ్ బచ్చన్:
బాహుబలి లో కట్టప్ప సినిమా కోసం మొదట అమితాబ్ ను అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వలన ఆయన ఈ రోల్ నుంచి తప్పుకున్నారు.
Advertisement
ప్రభాస్:
జూనియర్ ఎన్టీఆర్ సినిమా “సింహాద్రి” మొదటగా ప్రభాస్ వద్దకే వచ్చింది. కానీ, ప్రభాస్ వద్దనుకోవడంతో ఆ ఆఫర్ తారక్ కు వెళ్ళింది.
శ్రీదేవి:
ప్రభాస్ తల్లి పాత్ర శివగామి రోల్ ను మొదట శ్రీదేవితో చేయించాలని అనుకున్నారు. కానీ, ఆ రోల్ కు ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ ఆఫర్ రమ్యకృష్ణకు వెళ్ళింది.
శ్రద్ధ కపూర్:
ఆర్ ఆర్ ఆర్ లో జెన్నీ పాత్రకు మొదట శ్రద్ధ కపూర్ ను అనుకున్నారట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఒలీవియాను సంప్రదించారు.
కాజల్:
యమదొంగ సినిమాలో ప్రియమణి చేసిన రోల్ కోసం మొదట కాజల్ అగర్వాల్ ను అనుకున్నారట. కానీ, ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రియమణిని సంప్రదించారు.
పవన్ కళ్యాణ్:
రవితేజ విక్రమార్కుడు సినిమా కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చెయ్యడంతో ఆ ఆఫర్ రవితేజకు వెళ్ళింది.
సూర్య:
సూర్యని కూడా భల్లాల దేవ పాత్ర కోసం అనుకున్నారు. కానీ, సూర్య రిజెక్ట్ చేసాడు.
మోహన్ లాల్:
మోహన్ లాల్ ను కట్టప్ప పాత్ర కోసం అనుకున్నారు. కానీ, ఆ ఆఫర్ ను రిజెక్ట్ చెయ్యడంతో సత్యరాజ్ కు ఆ ఆఫర్ వెళ్ళింది.
ఇలాంటి మరిన్ని తెలుగు న్యూస్, హెల్త్ టిప్స్ ఇన్ తెలుగు, క్రికెట్ వార్తలు, సినిమా వార్తలు కోసం ఇవి చుడండి.. మరి కొన్ని సరికొత్త అప్ డేట్స్ కొరకు Teluguaction ఫేస్ బుక్ పేజ్ ని ఫాలో చెయ్యండి .