Advertisement
తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీ నన్ను టార్గెట్ చేసింది. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లాడు. దీనితో టీడీపీ నేతలు కోపంతో ఇలా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. మహిళా నేతలను టీడీపీ నేతలు అవమానిస్తున్నారని రోజా అన్నారు. మహిళల ఓట్లతో సత్యనారాయణ గెలిచారు. అతను చేసిన వ్యాఖ్యలు తన సొంత కుటుంబంలో మరియు తన నియోజకవర్గంలో మహిళలను గౌరవించలేదని రుజువు చేశాయని ఆమె అన్నారు.
Advertisement
బండారు సత్యనారాయణ నీచంగా మాట్లాడారని, ఒక మహిళ గురించి ఎవరూ ఈ విధంగా మాట్లాడలేదని, కోర్టుకు వెళ్లి బండారు లాంటి మగవాళ్లకు తగిన గుణపాఠం చెబుతానని ఆమె అన్నారు. కాగా.. ఈ విషయంలో నటి, మంత్రి రోజాకు సహా నటి మీనా తోడుగా నిలవనున్నారు. మీనాతో సహా పలువురు ఆమెకు సపోర్ట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. నటి రాధికా శరత్ కుమార్ ‘X’ (ట్విట్టర్) లో TD నాయకుడి “కించపరిచే ప్రకటనలను” ఖండించారు. నటి ఖుష్బు సుందర్ బండారు యొక్క “మహిళ ద్వేషపూరిత మనస్తత్వాన్ని” ఖండించారు మరియు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక నటి రమ్యకృష్ణ కూడా రోజాకు తన మద్దతు తెలిపారు.
Advertisement
ఇక నటి మీనా సాగర్ కూడా స్పందించారు. సక్సెస్ అయ్యిన మహిళలపై ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గు చేటు అని అన్నారు. మహిళలు సక్సెస్ అయితే.. వారిని చూసి అసూయా చెందడం సరికాదని.. నేటి మహిళలు అబలలు కాదని ఆమె అన్నారు. అతని మాటలని విని వదిలేయడం కాదని, పోరాటం జరుపుతామని మీనా అన్నారు. మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తిపై ఇలాంటి కామెంట్స్ చేసే హక్కు బండారుకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఆమెను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానని, ఆమె నాకు స్నేహితురాలు అని , ఆమెకు నా మద్దతు ఉంటుంది అని అన్నారు.
మరిన్ని..
మీ ఋతుచక్రాన్ని వాయిదా వేయడానికి ఈ మందులు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!